రాష్ట్రీయం

స్మార్ట్ గ్రిడ్ దిశగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో నీటి సమగ్ర వినియోగమే లక్ష్యంగా స్మార్ట్ వాటర్‌గ్రిడ్ దిశలో అడుగులు వేస్తున్నామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలవరం ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని, ఇది రాష్ట్రానికి జీవనాడిగానేకాక ప్రగతి చిహ్నంగానూ నిలుస్తుందన్నారు. నర్మదా ప్రాజెక్టుకు 1961లో శంకుస్థాపన చేస్తే పూర్తికావడానికి ఇన్నాళ్లు పట్టిందని, ఆలాకాకుండా పోలవరం అనుకున్న సమయానికి పూర్తయ్యేలా పనులను పరుగులు తీయిస్తున్నామన్నారు. ఇందులో అధికార యంత్రాంగంతో సహా అందరూ సహకరిస్తున్నారని, అయితే కొంతమంది మాత్రం కావాలని చిక్కులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా వాటిని అధిగమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ప్రతి నెల మూడవ సోమవారం ప్రత్యక్షంగా పరిశీలిస్తానన్న హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 19వసారి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి సోమవారం చేరుకున్నారు. తొలుత ఆయన ప్రాజెక్టు పనులను వ్యూపాయింట్ నుంచి పరిశీలించారు. అనంతరం స్పిల్‌వే పనులను పరిశీలించి విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి విషయంలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడా కరవు అనే మాట వినిపించకుండా నదుల అనుసంధానంతోపాటు గొలుసు చెరువుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనిలోభాగంగా రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఉంటే అందులో కోటి ఎకరాల్లో ఉద్యానవన పంటలు, మరొక కోటి ఎకరాల్లో మిగిలిన వ్యవసాయంతో ముందుకు వెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తిచేసి, కృష్ణాడెల్టాకు 118 టిఎంసి జలాలు తరలించామని, ఈ సీజన్‌లో ఇప్పటికే 58 టిఎంసి నీటిని తరలించటం ద్వారా అక్కడి పంటను కాపాడగలిగామన్నారు. ఈవిధంగా శ్రీశైలంలో కృష్ణాడెల్టాకు వినియోగించే నీటిని పొదుపుచేసి, ఆ నీటిని మిగిలిన ప్రాంతాలకు సర్దుతున్నామన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్టవ్య్రాప్తంగా ఏడు లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు ఆవిర్భవిస్తుందని స్పష్టంచేశారు. దీంతోపాటు 960 మెగావాట్ల విద్యుదుత్పత్తిచేసే ప్లాంటును నెలకొల్పుతామన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఎడమ, కుడికాల్వల పరిధిలో ఇబ్బందులు తలెత్తినా ఇక్కడ తీసుకున్న చర్యలవల్ల కొంతవరకు మెరుగైన వ్యవసాయాన్ని అందించగలిగామన్నారు. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి సుజలస్రవంతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, తాజాగా వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం అక్కడి నేరెడి బ్యారేజీకి అనుమతి లభించిందని, ఆ విధంగా 50టిఎంసి నీటిని వినియోగించుకునే హక్కు లభించిందన్నారు. ఈప్రాజెక్టు పూర్తయితే ఇచ్చాపురం వరకు జలాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా సాధ్యమవుతుందన్నారు. నీరు-ప్రగతి లక్ష్యంగా ఎక్కడపడిన వాననీరు అక్కడే భూగర్భజలంగా మారేలా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు విషయమై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ భూసేకరణకు సంబంధించి పనులన్నీ పారదర్శకంగా జరగాలని యంత్రాంగానికి స్పష్టం చేశామని, బినామీలకు లాభం చేకూర్చటంగాని, అర్హులైన రైతులకు నష్టం జరగడంగాని జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం అందిస్తామన్నారు. అనంతరం గేట్ల తయారీ పనులకు పూజలు చేసి సిఎం చంద్రబాబు ప్రారంభించారు. సిఎంవెంట మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు తదితరులున్నారు.

చిత్రం..పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న సిఎం చంద్రబాబు