రాష్ట్రీయం

ధర పెరిగిన సదావర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సదావర్తి ట్రస్టు భూముల వ్యవహారంలో ఆంధ్ర ప్రభుత్వం ఆలోచనలు తలకిందులయ్యాయి. చౌకగా సదావర్తి భూములను అందించాలన్న ప్రభుత్వ యోచన తలకిందులై న్యాయస్థానాల చుట్టూ తిరిగి చివరికి 60.30 కోట్ల రూపాయిలకు భూములు అమ్ముడుపోయాయి. సుమారు గంటపాటు పోటాపోటీగా సాగిన బహిరంగ వేలంలో సదావర్తి భూములు మూడింతలు ఎక్కువ ధర పలికాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం చెన్నైలో నిర్వహించిన వేలం పాటలో సదావర్తి భూములు ఏకంగా 60 కోట్ల 30 లక్షల రూపాయిల ధర పలికాయి. వేలంలో 83.11 ఎకరాల భూమిని కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ దక్కించుకుంది. సత్యనారాయణ బిల్డర్స్ తరఫున ప్రొద్దుటూరు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలు శ్రీనివాసరెడ్డి వేలంలో పాల్గొన్నారు. కాగా ఆ సంస్థలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డితో పాటు పలువురు భాగస్వామ్యులున్నారు. 27 కోట్ల 45 లక్షల నుంచి ప్రారంభమైన వేలం పాట ముందునుంచీ పోటాపోటీగా సాగింది. టెండర్లలో 54 కోట్లకు బ్రహ్మానంద కోట్ చేశారు. అయితే బహిరంగ వేలంలో మాత్రం 60 కోట్ల 30 లక్షలకు సత్యనారాయణ బిల్డర్సు భూములను దక్కించుకుంది. గతంతో పోలిస్తే దాదాపు మూడురెట్లు అంటే 37 కోట్ల 90 లక్షలు అధిక ధర పలికింది. వేలం ప్రక్రియ మొత్తాన్ని సుప్రీంకోర్టుకు నివేదిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ తెలిపారు.
చెన్నై టి.నగర్‌లోని టిటిడి సచాచార కేంద్రంలో సోమవారం ఉదయం సదావర్తి భూముల అమ్మకానికి వేలం ప్రక్రియ నిర్వహించారు. టెండర్ కమ్ సీల్డు కవర్ కమ్ బహిరంగ వేలం పద్ధతిన 83.11 ఎకరాల భూముల అమ్మకానికి మళ్లీ వేలం నిర్వహించారు. దేవాదాయ కమిషనర్ అనురాధ నేతృత్వంలోని భూముల వేలం కొనసాగింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ వేలానికి ఎమ్మెల్యే ఆర్కే హాజరయ్యారు. కాగా సదావర్తి సత్రం పేరిట ఉన్న 83.11 ఎకరాల భూముల అమ్మకానికి ఆంధ్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 28న చెన్నైలో బహిరంగ వేలం నిర్వహించింది. అపుడు జరిగిన వేలం ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, సర్కారు పెద్దలు ఆ భూములను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేశారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టుకు వెళ్లడంతో ఏడాదిన్నరగా దీనిపై వివాదం కొనసాగింది. అయితే సదావర్తి సత్రం భూములుగా పేర్కొంటున్నవి అసలు తమ ఆస్తి అని ఏపీ ప్రభుత్వం పేర్కొనగా, ఆంధ్రకు ఎలాంటి అధికారం లేదని వేలం ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.