రాష్ట్రీయం

హైదరాబాద్, బెంగళూరుపై ఉగ్రమూకల కుట్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: హైదరాబాద్, బెంగుళూరు లక్ష్యంగా ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు, జనకూడళ్ల వద్ద గట్టి నిఘా పెంచారు. విదేశీ రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసుకున్న బంగ్లాదేశ్ ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయ. దీంతో ఒక్కసారిగా పోలీసులు నిఘాను పెంచడమే కాకుండా వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదులు రాష్ట్రంలోని ఇజ్రాయెల్, ఫ్రాన్స్, అమెరికా రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఉగ్రవాదులు, ఐసిస్‌తోపాటు పలు సంస్థలకు చెందిన ఉగ్రవాదులతో కలసి వివిధ ప్రాంతాల్లో ఎప్పుడైనా.. ఏ క్షణమైనా.. విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాలకు సూచించినట్టు సమాచారం. ఢిల్లీ తరువాత హైదరాబాద్, బెంగుళూరు నగరాలు ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవలి కాలం నుంచే హెచ్చరిస్తున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇటీవల ముజఫర్‌నగర్‌లో ఓ ఉగ్రవాది అరెస్టు కాగా, అతని సమాచారం మేరకు దాడులు జరగొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు, బహుళ అంతస్థులు భవనాలు, జనకూడళ్లపై దాడులు జరుగొచ్చని, ఈమేరకు పోలీసులు గట్టి నిఘా వేశారు. ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.