రాష్ట్రీయం

తెలంగాణలో ‘్ఫ్యను’ గాలి వీచేనా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (్ఫ్యను-ఎన్నికల గుర్తు) గాలి వీచేనా!?. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని ఎలా బలపరచాలన్న అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తర్జన-్భర్జన పడుతున్నది. సోమవారం వైకాపా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి, పార్టీ రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభృతులు పార్టీ కార్యాలయంలో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చించారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టానని, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవల గురించి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, వైఎస్ పేరు చెబితే ప్రజలు కేరింతలు కొడుతున్నారని, కరతాళధ్వనులు చేస్తున్నారని డాక్టర్ గట్టు వివరించారు. అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ పార్టీ కమిటీలను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ళ నుంచి పాదయాత్ర చేపట్టిన ప్రాంతం నుంచే తానూ పాదయాత్ర చేపట్టేందుకు ‘రూట్ మ్యాప్’ తయారు చేయిస్తున్నానని ఆయన సమావేశంలో వివరించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించడం కష్టమవుతుందని సజ్జల అభిప్రాయపడ్డారు. కాగా జగన్ సోదరి షర్మిల ప్రచారానికి మంచి వచ్చినా కార్యకర్తల్లో మంచి ఉత్సాహం వస్తుందని పార్టీ నాయకులు తెలిపారు.