రాష్ట్రీయం

ఇవిగో.. టీచర్ల ఉమ్మడి సర్వీస్ రూల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 20: ఉపాధ్యాయులు రెండు దశాబ్దాల నుండి ఎదురుచూస్తున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు సంబంధించి మూడు జీవోలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విజయవాడలో విడుదల చేశారు. జీవో 72లో రాష్టప్రతి ఉత్తర్వులు, 73లో గజిటెడ్ ఉద్యోగులకు, జీవో 74ను నాన్ గజిటెడ్ ఉద్యోగులకు సంబంధించి విడుదల చేశారు. సర్వీస్ రూల్స్ ఆధారంగా ప్రమోషన్ పొందేందుకు వీలుగా జీవోలున్నాయి. ఈసందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ 1962లో మొదటిసారి ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌పై జీవో 75 విడుదల చేశారని, 1981లో పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌పై జీవో 168 విడుదల చేశారన్నారు. 1998లో 505 గజిటెడ్, 538 నాన్ గజిటెడ్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌లో భాగంగా ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఏకీకృత రూల్స్ జీవో విడుదల చేయగా, 2003లో ఏకీకృత రూల్స్‌కు వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించారన్నారు. 2006లో కామన్ రూల్స్ రావడంతో 2007లో హైకోర్టు జీవోలను రద్దు చేసినట్లు తెలిపారు. 2009లో సుప్రీంకోర్టు స్టే ఇవ్వగా 2015లో తుదితీర్పు వెలువడిందని, రాష్ట్ర ప్రభుత్వం రాష్టప్రతి ఆమోదానికి పంపగా 2017లో ఆమోదం లభించిందన్నారు. రాష్టప్రతి ఆమోదానికి ప్రసుత్త ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు నాటి కేంద్ర మంత్రిగా కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. దాదాపు 2లక్షల మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి మానవవనరుల శాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు తాను కలిసి వెళ్ళడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరగా
ఆమోదం పొందేందుకు మార్గం సుగమమైందన్నారు. ఢిల్లీలో మాజీ ఐఎఎస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీని నియమించి ఎప్పటికప్పుడు రూల్స్‌పై న్యాయ సలహాలు తీసుకొని ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి గంటా వివరించారు. జీవో 302ను పునరుద్ధరిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100శాతం ఉద్యోగ భద్రత కల్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్ సంధ్యారాణి, పలువురు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.