రాష్ట్రీయం

దుర్గమ్మ.. ధగధగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి (విజయవాడ), సెప్టెంబర్ 20: ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రభుత్వ పండువలా లాంఛనంగా మొదలయ్యాయ. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు, జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఇవో సూర్యకుమారి, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, వివిధ శాఖల అధికారులు నెల రోజులుగా సమీక్షలు నిర్వహించారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. ఉత్సవ ఏర్పాట్ల కోసం ఈ ఏడాది పాలకవర్గం రూ. 15కోట్లు కేటాయించింది. మూలానక్షత్రం రోజున సిఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేరోజు అమ్మవారికి తన మొక్కుబడులు తీర్చుకోడానికి తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు దుర్గగుడికి వస్తున్నారు.
ఇదిలావుంటే, బుధవారం రాత్రి నుంచే విద్యుద్దీపాలంకరణాల మధ్య ఇంద్రకీలాద్రి శోభాయమానంగా విరాజిల్లుతోంది. పదిరోజుల్లో కనీసం 15లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలతో ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం రాజీవ్ పార్క్ నుంచి ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. రైల్వే, బస్‌స్టేషన్ల నుంచి కొండ దిగువ వరకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. గత ఏడాది మాదిరిగానే అంతరాలయం దర్శనానికి రూ.300 టికెట్ రేటు నిర్ణయించారు. మూలానక్షత్రం రోజున అందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. విశేష చండీహోమం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుంది. మూలానక్షత్రం రోజున మూడు విడతలుగా పూజలు జరగనున్నాయి. ఉభయ దాతల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. కృష్ణానది స్నానఘాట్ల వద్ద ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటయ్యాయి. పడవల్లో నిరంతరం గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్నిచోట్లా సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని కాలినడకన ఘాట్‌రోడ్డులో ఏర్పాట్లు పర్యవేక్షించారు. తొలిరోజు దుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంకృత అలంకారంతో భక్తులకు దర్శనమివ్వనుంది. తెల్లవారుఝాము మూడు గంటలకు సుప్రభాత సేవలో అమ్మవారికి పచ్చకర్పూరం పసుపు, గంథం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం బాలభోగి నివేదనతో జరుగుతాయి. 9 గంటల నుంచి సర్వదర్శనం మొదలవుతుంది.