రాష్ట్రీయం

ఎనిమిది వారాల్లో పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ నియామకంపై కమిటీని నియమించినట్లు ఆంధ్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వచ్చే ఎనిమిది వారాల్లో (రెండు నెలల్లో) ఈ ప్రక్రియను ముగిస్తామని కోర్టుకు ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్లను నియమించాలని కోరుతూ ఈ సంస్థ కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం విదితమే. ఇప్పటికే తమ ప్రభుత్వం సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్, సమాచార కమిషనర్‌లను నియమించిందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆంధ్ర ప్రభుత్వం వచ్చే ఎనిమిది వారాల్లో సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించి, ఈ కేసు విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.