రాష్ట్రీయం

కాళేశ్వరానికి అటవీ, పర్యావరణ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: అటవీ, పర్యావరణశాఖ అనుమతులు లేకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో నిలిచిపోయిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో కాటారం, మహేదేవ్‌పూర్, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల్లోని 45 వేల ఎకరాలకు సాగునీటిని అందించే పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే నాలుగు మండలాల్లోని 63 గ్రామాలకు మంచినీటి సరఫరాకు కూడా అడ్డంకులు తొలిగిపోయాయి. మంథని నియోజకవర్గం పరిధిలో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు అటవీ, పర్యావరణశాఖ అనుమతులు లేకపోవడంతో ఆరు సంవత్సరాలుగా ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నీటి ముంపు, నిర్వాసితులకు పునరావాసం వంటి ఇబ్బందులు ఏమిలేకపోవడంతో కాళేశ్వరం ఎత్తిపోతల పనులకు అనుమతి మంజురు చేసినట్టు అటవీ, పర్యావరణశాఖల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మంథని నియోజకవర్గంలో
అటవీ ప్రాంతం కలిగి ఉన్న నాలుగు మండలాల పరిధిలో 600 ఎకరాలను ప్రాజెక్టు పనుల కోసం వినియోగించుకోవచ్చని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద గోదావరి నుంచి 4.5 టిఎంసిల నీటిని మహేదేవ్‌పూర్ మండలంలోని 14 చెరువులు, కుంటలు నింపడం ద్వారా 18,21 హెక్టార్లకు సాగునీటి సదుపాయం కలుగుతుంది. అలాగే 4.5 టిఎంసిల నీటి నుంచి 0.3 టిఎంసిల నీటిని మంచినీటి అవసరాల కోసం వినియోగించుకోవడం ద్వారా మహేదేవ్‌పూర్, కాటారం. మల్హర్‌రావు, మహాముత్తారం మండలాల్లోని 63 గ్రామాలకు సాగునీరు అందించవచ్చు. పర్యావరణ, అటవీ అనుమతి లభించడంతో మహేదేవ్‌పూర్ మండలంలోని 10,086 ఎకరాలకు, మహాముత్తారం మండలంలోని 6203 ఎకరాలకు, కాటారం మండలంలోని 27,809 ఎకరాలకు, మల్హర్‌రావు మండలంలోని 1643 ఎకరాలకు మొత్తంగా 45,742 ఎకరాలకు సాగునీటి సదుపాయం కలుగనుంది.
ఇక వచ్చే జూన్‌కల్లా పనులు పూర్తి: మంత్రి హరీశ్‌రావు
భూపాలపల్లి జిల్లాలో అటవీ,పర్యావరణశాఖల అనుమతి లభించకపోవడంతో నిలిచిపోయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను ఇక వెంటనే చేపట్టి వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు అటవీ,పర్యావరణశాఖల అనుమతి లభించడం పట్ల ఆ శాఖల కేంద్ర మంత్రి హర్షవర్దన్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రభుత్వం అటవీ అనుమతి కోసం నిరంతరం చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి హర్షం ప్రకటించారు. ప్రాజెక్టు పనులను ఇక వేగవంతం చేసి 45 వేల ఎకరాలకు సాగునీరు, 63 గ్రామాలకు మంచినీరు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.