రాష్ట్రీయం

టిఆర్‌ఎస్ నేతలతోనే ఆర్‌ఎస్‌ఎస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 21: తెలంగాణలో టిఆర్‌ఎస్ కార్యకర్తలతో రైతు సమన్వయ సమితులను (ఆర్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేయడంతో అసలైన రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయనున్నట్లు ఏఐసిసి కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసర్వేలలో నిజమైన రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన ఇందిరమ్మ రైతుబాట చైతన్య సదస్సులో వారు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తామేదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకుంటున్న భూరికార్డుల సవరణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడో చేసిందన్నారు. ఏడు దశాబ్దాల క్రితమే దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు భూహక్కులను కల్పించిందన్నారు. నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ బలవంతపు భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్ళకాలంలో ప్రజలను అనేక రకాలుగా మోసం చేసిందన్నారు.దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం మూడున్నర లక్షల దళిత కుటుంబాలు అర్హులుగా ఉన్నప్పటికీ, కేవలం మూడువేల మందికి ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల ఊసేలేదని, నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టివేసిందని, రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడంతో వారిచ్చిన రుణం వడ్డీకే సరిపోయిందన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటుధర అడిగిన పాపానికి రైతులను జైళ్ళలో పెట్టించిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో యాబైవేల కోట్లను దుర్వినియోగం చేసిందన్నారు.

చిత్రం..ఖమ్మంలో ఇందిరమ్మ రైతుబాట సదస్సులో మాట్లాడుతున్న కుంతియా