రాష్ట్రీయం

జనం కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతో సంపద సృష్టించేందుకు కష్టపడుతున్నా. ఇంటింటికీ తేదేపాతో సమస్యలు పరిష్కరిస్తామని సిఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లో ఏ సమస్యలు లేకుండా చేసినప్పుడు అక్కడ మరో పార్టీ ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. 2029 వరకూ తామే అధికారంలో ఉంటామన్న ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంటింటికీ తెలుగుదేశం ప్రారంభించి 11 రోజులైందని, గ్రామాల్లో మంచి స్పందన లభిస్తోందని, రెండు నెలల్లో అన్ని కుటుంబాలను కలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అర్జీలను నాలుగు కేటగిరీలుగా విభజించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయాలు వేరన్నారు. అర్హతే ప్రాతిపదికగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కలెక్టర్లు బాగా పని చేస్తున్నారని, కొన్ని గ్యాప్స్ ఉన్నా, గతం కంటే మెరుగైందన్నారు. గతంలో రాష్ట్రంలోని అధికారుల బృందాన్ని బి టీమ్‌గా ఎద్దేవా చేశారని, ఆ టీమ్ ఇప్పుడు బెస్ట్ టీమ్‌గా మారిందన్నారు. ఒక రోజులో 1.2 కోట్ల మందికి కాల్ చేసి అభిప్రాయాలు సేకరిస్తున్నామని, ప్రజలకు ఎలా దగ్గర కావాలో ఆలోచిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలనపై 80 శాతం సంతృప్తి, పార్టీతో అనుంబంధం 80 శాతం సాధించడం లక్ష్యమన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అనుకూలతను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, వివిధ సంక్షేమ పథకాల అమలువల్ల ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెదేపా వెంట ఉంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, 2029 వరకూ ప్రజలు తమ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. గతంలో రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్భ్రావృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానన్నారు. నదుల అనుసంధానం, గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించడం ద్వారా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే నీటి కొరత ఉండదన్నారు. విద్యుత్ చార్జీలు ఇక పెంచబోమన్నారు. అక్టోబర్ 2న స్వచ్ఛ ఏపి అవార్డులు, 1.4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు, రైతు రుణ ఉమశమన కార్యక్రమం మూడో దశకు నాంది, గ్రామాల్లో ఎల్‌ఇడి బల్బుల కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. ఎంపి జెసి దివాకర రెడ్డి వ్యవహారం పెద్ద సమస్య కాదన్నారు. ప్రజా ప్రతినిధులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చెప్పి చేయించుకోవాలన్నారు. ప్రతిపక్షం వివిధ అభివృద్ధి పనులను, నీటి పథకాలను అడ్డుకుంటోదని విమర్శించారు. పులివెందులకు నీళ్లు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని, సొంత ప్రాంతానికి నీళ్లు ఇస్తే, ఎవరైనా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ నీటిని దొంగిలిస్తున్నామని ప్రచారం చేయడం తనను బాధించిందన్నారు. దొంగతనం ఎందుకు చేస్తామని, చేస్తే తెలియదా అని వ్యాఖ్యానించారు.