రాష్ట్రీయం

పెద్దశేష వాహనంపై శ్రీనివాసుని చిద్విలాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 23: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రారంభమైన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి 9గంటలకుప్రారంభమైన పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. అనంతరం పద్మావతి అతిథిభవనానికి బయలుదేరి వెళ్ళారు. కాగా తొలిరోజైన శనివారం శ్రీదేవి, భూదే వి సమేతుడైన మలయప్ప స్వామి విశేషాలంకార భూషితుడై పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి రాత్రి 9 నుంచి 11 గంటల వరకు తిరుమాడా వీధి ల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు ఆదిశేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యశూరుల్లో ఆదిశేషుడు ఆద్యుడు. భూబారాని వహించేది శేషుడే. శేష వాహనం దాస భక్తికి నిదర్శనమని, ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం ఆపై పరమ పదం సిద్దిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే శేష వాహనంపై శ్రీనివాసుడిని దర్శించడానికి భక్తులు ఎనలేని ఆసక్తిని చూపుతారు.
శ్రీవారికి రూ.8.39 కోట్లు విలువ చేసే
సహస్రనామ కాసుల హారం విరాళం
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి విజయవాడకు చెందిన మంతెన రామలింగరాజు అనే భక్తుడు 28.645 కిలోల బరువు కలిగిన 8.39 కోట్ల రూపాయలు విలువ చేసే ఐదు పేటల సహస్రనామాల లక్ష్మీకాసుల హారాన్ని సిఎం సమక్షంలో టిటిడికి అందజేశారు. 1008 కాసులున్న ఈహారంలో ప్రతి కాసుపైన సహస్రనామాలను ముద్రించారు. వాస్తవానికి రామలింగరాజు టిటిడికి రూ. 16 కోట్లు 2013 లో విరాళంగా అందించారు. అయితే టిటిడి ఆ సొమ్మును అలాగే ఉంచేసింది. ఇ ఒగా సాంబశివరావు ఉన్నప్పుడు కాసు లహారాన్ని తయారు చేయించడానికి బోర్డు అనుమతి పొందారు. ఈక్రమంలోనే తయారు చేసిన సహస్ర నామార్చన కాసుల హారాన్ని రామలింగరాజు సి ఎం చేతులు మీదుగా టిటిడికి అందజేశారు. తక్కిన మొత్తాన్ని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించిన అన్నదానం భవనానికి విరాళంగా ఇవ్వాలని ఆయన్ను టిటిడి కోరినట్లు సమాచారం.

చిత్రాలు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి పెద్దశేష వాహన సేవ,* స్వామికి విజయవాడకు చెందిన మంతెన రామలింగరాజు అనే భక్తుడు బహూకరించిన 8.39 కోట్ల రూపాయలు విలువ చేసే సహస్రనామాల లక్ష్మీకాసుల హారం