రాష్ట్రీయం

వేదమాత గాయత్రీదేవిగా దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: దసరా శరన్నవరాత్రి వేడుకల్లో మూడోరోజైన శనివారం ఆశ్వయుజ శుద్ధ తదియ రోజున ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ వేదమాత గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అర్చకులు జ్ఞాన వైరాగ్యాలను సిద్ధంపచేసే గాయత్రీ మంత్ర విశిష్టతలను భక్తులకు వివరించారు. పంచ ముఖాలతో ప్రకాశించే గాయత్రీమాత దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఇదే సమయంలో భవానీదీక్ష మండపంలో గాయత్రీమాతగా అలంకరించిన దుర్గమ్మ సన్నిధిలో భక్తులు ప్రత్యేక కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించారు. ఇక భక్తులు సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా వినతికెక్కిన ఆ పరమేశ్వరిని పంచముఖాలతో దర్శించుకుని తరించారు. ముఖ్యంగా గాయత్రీ మంత్రాన్ని నిత్యం జపించేవారు, ఉపాసకులు ఈ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోడానికి విశేష ప్రాధాన్యతనిస్తారు. నివేదన చేసే పదార్థాలను కూడా గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాత అర్చకస్వాములు ఉపాలయాలకు తీసుకువస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అశేష భక్తజనానీకం సకల మంత్రాలకు మూలమైన శక్తిగా... వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీ దేవిని దర్శించుకుని పునీతులయ్యారు. ఇక ప్రభాత సమయం నుంచే భక్తులు సమీప పవిత్ర కృష్ణవేణిలో స్నానమాచరించి భక్తి పారవశ్యంతో దుర్గమ్మను దర్శించుకున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అంతర్భాగాలుగా తనలో నిలుపుకుని పరాశక్తిగా అవతరించిన గాయత్రి రూప సందర్శనతో ముక్తి యోగం సంప్రాప్తిస్తుందని భాగవతులు ఉపదేశిస్తుంటారు. వేద వేదాంగాలకు, వైదిక అనుష్టానాలకు, మంత్ర తంత్ర యజ్ఞ యాగాది ఫలమైన హవిస్సులకు ఆది దేవతగా పురాణ ప్రవచితమైన దేవతా స్వరూపాన్ని ఈ ఉత్సవ దినాల్లో తరించేందుకు భక్తులు భారీఎత్తున బారులు దీరారు. విద్యా సంస్థలకు సెలవు దినాలు, శనివారం కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సచివాలయ డైరెక్టరేట్‌లు, కమిషనరేట్ ఉద్యోగులకు సెలవుదినం కూడా కావటంతో కుటుంబాలకు కుటుంబాలే తరలివచ్చాయి.