రాష్ట్రీయం

భద్రాద్రిలో విరిగిపడిన రాజగోపుర రాతిఫలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 23: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ రాజగోపురం స్వల్పంగా బీటలు వారడంతో పై భాగంలోని రాతిఫలకం శనివారం తెల్లవారుజామున కింద పడిపోయింది. రాతిఫలకం కూలిన
సమయంలో భక్తులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రాజగోపురం మీదుగానే నిత్యం దర్శనాలు జరుగుతున్నాయి. ఎంతో చరిత్ర ఆలయంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనం కలిగించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఆలయ రక్షణ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏమైందని గమనించగా రాజగోపురం నుండి రాతిఫలకం కిందపడి ఉండటాన్ని గమనించారు. అయితే ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినా మీడియా ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. కాగా రాజగోపురం రాతిఫలకం విరిగిపోవడంతో ఆ దారి గుండా భక్తుల దర్శనాలను ఆలయ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఉత్తరద్వారం గుండా చిత్రకూట మండపం మీదుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. రాజగోపురానికి అక్కడక్కడ చిన్న చిన్న బీటలు ఉన్నాయి. ఆలయం నిర్మించిన నాటి నుంచి ఇటువంటి సంఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని అర్చకులు పేర్కొంటున్నారు. ఆలయాన్ని ఆధునీకరించేందుకు ఇటీవలే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన నేపథ్యంలో మరికొన్ని నెలల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఘటనపై ఆలయ స్తపతితో ఈవో మాట్లాడారు. ఆగమశాస్త్ర పండితులు, స్తపతి, ఆర్కిటెక్ట్‌తో సంప్రదింపులు జరిపి మరమ్మతులు, ఇతర చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు. ఈ ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఆలయ ఈవో మంత్రికి జరిగిన ఘటనను వివరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఈవోను తుమ్మల ఆదేశించారు.

చిత్రాలు..భద్రాచలం ఆలయ రాజగోపురం నుండి విరిగిపడిన రాతిఫలకం