రాష్ట్రీయం

నేరం జరగొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశ వ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాదం, విధ్వంసకర శక్తుల కార్యకలాపాలను ముందుగా పసిగట్టి మొగ్గలోనే తుంచేందుకు కొత్తగా ‘నేరాలు సంభవించే ప్రాంతాలు’ మ్యాపింగ్‌ను కేంద్ర హోంశాఖ రూపొందిస్తోంది. ఈ బాధ్యతను అంతర్జాతీయంగా ప్రతిష్టాకరమైన నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరోకు అప్పగించారు. క్రైమ్ డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్ధ రూపొందించింది. దీని ద్వారా దేశంలో నేరాలు జరిగే ప్రదేశాలపై నిఘా పెట్టి, ఫలానా చోట నేర ఘటనలు సంభవించే అవకాశాలుంటాయని ఎన్‌సిఆర్‌బి ముందస్తుగా హెచ్చరిస్తుంది. దీనినే ప్రిడిక్ట్ క్రైమ్ అంటారు. వచ్చే ఏడాది మార్చిలోగా ప్రిడిక్టివ్ పోలీసింగ్ టెక్నాలజీని ఐదు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, త్రిపురలో అమలు చేస్తారు. రెండోదశలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రిడిక్టివ్ క్రైమ్ పోలీసింగ్‌ను అమలు చేస్తారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ డాటా అనలిటిక్స్ సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు సమాచారం. దీనిద్వారా సిబిఐ, ఎన్‌ఐఏ, రాష్ట్ర పోలీసు విభాగాలు, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ శాఖలు నేరాలు జరిగే తీరు, కొత్త పోకడలు, నేరాలు ఎక్కువగా జరిగే హాట్ స్పాట్స్, వాటి గురించి విశే్లషించడం, ముందస్తుగా అంచనా వేస్తాయ. దేశంలోని భౌగోళిక ప్రాంతాలు, గతంలో అక్కడ చోటు చేసుకున్న నేర ఘటనలు విశే్లషించి డాటా అనలిటిక్స్‌ను రూపొందిస్తారు. ప్రిడిక్టివ్ క్రైమ్ ద్వారా ముందుగా పోలీసు గస్తీని పెంచడం, సకాలంలో పారా మిలిటరీ బలగాలను మెహరించడం, నిఘాను పటిష్టం చేయడం చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్ధతో నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో అవగాహనా ఒప్పందం ఖరారు చేసింది. వచ్చే మార్చి నాటికి ఈ సాఫ్ట్‌వేర్ సిద్ధమైతే, కేంద్ర హోంశాఖ దీన్ని అన్ని రకాలుగా విశే్లషించి ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో అమలు చేస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేవలం విధ్వంసకర శక్తులు, దోపిడీ ముఠాలను పట్టుకునేందుకు మాత్రమే కాకుండా ఉగ్రవాద, తీవ్రవాద సంస్థ దాడులు బహుశా ఫలానా ప్రాంతంలో దాడులు జరిపే అవకాశం ఉందని ముందుగా పసిగట్టవచ్చునని పోలీసు అధికారులు తెలిపారు.
ఉదాహరణకు నక్సల్స్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాలు, ఉగ్రవాద కార్యకలాపాలు గతంలో ఉన్న ప్రాంతాలను భౌగోళిక ప్రదేశాల ఆధారంగా విశే్లషించి అక్కడ ఏ సమయంలో ఎటువంటి ఘటనలు జరుగుతాయో అంచనా వేసేందుకు డాటా ఉపయోగపడుతుంది. బస్తర్ ప్రాంతంలో రోడ్లను నిర్మిస్తున్నారు. ఇక్కడ కేంద్ర పారామిలిటరీ బలగాల గస్తీ ఉంటుంది. కానీ మావోయిస్టులు తరచుగా పోలీసులపై దాడులు చేసి హింసాకాండకు పాల్పడుతుంటారు. ఈ ప్రదేశాలను డాటా ఆధారంగా పోలీసు శాఖ జల్లెడపడుతుంది. పోలీసుల్లోల నిఘా విభాగం స్ధానిక జనాభా, వారి ధోరణులు, అక్కడ లభించే వౌలిక సదుపాయాలు, తీవ్రవాదులు, ఉగ్రవాదులకు ఇచ్చే మద్దతుపై అంచనా వేస్తారు. ఇది నూటికి నూరు శాతం హింసాకాండ ఘటనలను అంచనావేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పలేమని, కాని వీలైనంత వరకు వాస్తవానికి దగ్గరగా డాటా నేరాలను అరికట్టేందుకు దోహదపడుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారులు అంటున్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు వంద సంవత్సరాల నేరాల డాటాను సేకరించి విశే్లషిస్తుంటాయి. ఈ తరహాలోనే ఎన్‌సిఆర్‌బి డాటా సేకరణకు శ్రీకారం చుట్టింది. వాతావరణ శాఖ హెచ్చరికలు లాగానే, నేరాలు సంభవించే అవకాశం ఉందనే హెచ్చరికలు రానున్న సంవత్సరాల్లో జారీ చేస్తారు.