రాష్ట్రీయం

తినేవారే కొనండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: రేషన్ బియ్యం తినేవారు మాత్రమే రేషన్ దుకాణాల్లో బియ్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ తదితర పనులపై సమీక్షిస్తూ రబీ సీజన్‌కు ప్రణాళిక రూపొందించేందుకు వీలుగా ఆదివారం జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొంతమంది రేషన్ దుకాణాల్లో బియ్యం కొనుక్కుని, వెంటనే మార్కెట్లో అమ్మివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం పూర్తిగా మారాలని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, కేవలం పేదలకోసమే ఉద్దేశించిన రేషన్ బియ్యం వారికి మాత్రమే అందేలా చూడాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభు త్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.91 కోట్ల బిపిఎల్ కుటుంబాలు ఉండగా, మన వద్ద మాత్రం 3.05 కోట్ల బిపిఎల్ కుటుంబాల నమోదయ్యాయని, సమగ్ర పరిశీలన తర్వాత ఈ సంఖ్య 2.75 కోట్లకు తగ్గించగలిగామన్నారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోకుండా జిపిఎస్ విధానం చాలా బాగా ఉపయోగపడుతోందని వివరించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో గతంలో అనేక అక్రమాలు జరిగేవని, వీటిని నివారించేందుకు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పూర్తిగా
వినియోగించుకుంటున్నామని ఈటల పేర్కొన్నారు. పాతవిధానాలకు పాతర వేస్తూ, కొత్త పద్ధతులకు తెరతీశామని, అధికార యంత్రాంగం గత కొంతకాలంగా చాలా బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. 2016-17లో క్షేత్రస్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచిన పౌరసరఫరాల అధికారులకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలను అందించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించడం వల్ల పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు పాల్పడి బతికి బట్టకట్టలేమన్న ఆలోచన అందరిలో వచ్చిందన్నారు. రేషన్ వాహనాలకు జీపిఎస్ విధానం కొనసాగింపు, గోదాముల్లో సిసి కెమెరాల ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం తదితర రూపాల్లో ఆధునిక విజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ శాఖద్వారా వినియోగిస్తున్న నిధులకు గతంలో లెక్కలు సరిగా ఉండేవి కావని, ఇప్పుడు ప్రతి పైసా లెక్క తేలుతోందన్నారు. గన్ని సంచులతో సహా ప్రతి అంశంపై లెక్కలున్నాయన్నారు.
గతంలో గోదాముల్లో టన్నుల కొద్దీ బియ్యం నిరుపయోగంగా మారి చెడిపోయేదని, ఇప్పుడు బియ్యం నిలువలు శాస్ర్తియంగా ఉండటం వల్ల చెడిపోవడం లేదన్నారు. ఈ-పాస్ మిషన్స్ వల్ల బియ్యం అక్రమ వినియోగం తగ్గిందని వివరించారు. పౌరసరఫరాల సంస్థ గత ఏడాది ఖరీఫ్‌లో 16.47 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో 27 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని ఈటల తెలిపారు. ఇందుకోసం 2,800 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఖరీఫ్‌లో మిల్లర్లకు అప్పగించిన ధాన్యం నుండి 99.91 శాతం బియ్యం సేకరించి రికార్డు నెలకొల్పామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు నిధులు కేటాయించామని వివరించారు.
జాయింట్ కలెక్టర్లు, డిసిఎస్‌ఓలు, డిఎంలు, ఇతర సిబ్బంది బాగా పనిచేయడం వల్ల పౌరసరఫరాల శాఖలో సంస్కరణలు విజయవంతంగా కొనసాగుతున్నాయని కమిషనర్ సివి ఆనంద్ కితాబిచ్చారు. 2016-17 సంవత్సరంలో రైతుల ఉండి ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసి 8100 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమచేశామన్నారు. ఐటి వినియోగంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దేశానికే ఆదర్శంగా నిలచిచిందని గుర్తు చేశారు. త్వరలోనే జెసిల కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోర్టబిలిటీ విధానం అమలు చేస్తామని ఆనంద్ పేర్కొన్నారు.

చిత్రం..క్షేత్రస్థాయిలో ప్రతిభ కనబరచిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న మంత్రి ఈటల