రాష్ట్రీయం

భద్రాద్రి రాజగోపురం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 24: భద్రాచలం రామాలయం రాజగోపురానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని పురావస్తు శాఖాధికారులు తెలిపారు. రాజగోపురం పైభాగం స్వల్పంగా బీటలు వారిందని, వర్షానికి నీరు రాజగోపురంలోని ఇతర భాగాలకు చేరుకోడంతో రాతిఫలకం నానిపోయి విరిగి పడిపోయిందని వారు నిర్థారించారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాజగోపురం పైనుంచి రాతిఫలకం శనివారం తెల్లవారుజామున విరిగిపడిన సంగతి విదితమే. ఇది సర్వత్రా చర్చనీయాంశం కావటంతో ఆ దారి నుంచి భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. జరిగిన సంఘటనను దేవస్థానం ఇవో ప్రభాకర శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్‌కు తెలపడంతో ఆయన పురావస్తు శాఖాధికారులను సంప్రదించి భద్రాచలం పంపారు. ఆదివారం ఆలయానికి వచ్చిన పురావస్తు శాఖాధికారులు రాతిఫలకం విరిగిపడిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రాతిఫలకం పరిమాణం, పడిన తీరు, ఎక్కడి నుంచి పడిందనే విషయాలను వారు నమోదు చేసుకున్నారు. అనంతరం రాజగోపురం పటిష్ఠతను పరిశీలించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రాజగోపురం కావడంతో స్వల్పంగా బీటలు వారిందని, వాటిద్వారా వర్షపు నీరు క్రమంగా రాతిఫలకాల వద్దకు చేరుకుని నానుతోందని, ఈ క్రమంలో ఓ రాతిఫలకం దృఢత్వం కోల్పోయి విరిగిపడిందని వారు నిర్థారించారు. ఈసందర్భంగా పురావస్తు శాఖ ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ రాజగోపురం స్వల్పంగా బీటలు వారిందని చెప్పారు. వర్షపు నీరు ఇంకకుండా చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. రాజగోపురం వద్ద ఇనుప మెష్‌లు పెట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇవో ప్రభాకర శ్రీనివాస్ మాట్లాడుతూ రాజగోపురానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మతులు చేపడతామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. స్థపతి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని మరమ్మతులు ఎప్పటి నుంచి చేపట్టవచ్చో త్వరలో ప్రకటిస్తామని, ప్రస్తుతానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్తర ద్వారం ద్వారా స్వామివార్ల దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజగోపురాన్ని స్థపతి వల్లి నాయగం, ఎస్‌ఇ వెంకట్రావ్ కూడా పరిశీలించారు.

చిత్రాలు..రాజగోపురం నుంచి విరిగిపడిన రాతిఫలకాన్ని పరిశీలిస్తున్న పురావస్తు శాఖాధికారులు,
*రాజగోపురం పైభాగాన్ని పరిశీలిస్తున్న ప్రొఫెసర్ పాండురంగారావు