రాష్ట్రీయం

ప్రపంచ బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ ఆడపడచులు ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకునే బతుకమ్మ పండగకు మంగళవారం ఎల్‌బి స్టేడియంలో సరికొత్త సొబగు చేకూరింది. రెండేళ్లుగా నిర్వహిస్తున్న ‘మహాబతుకమ్మ’ కొనసాగింపుగా ముచ్చటగా మూడోపర్యాయం మహాబతుకమ్మ నిర్వహించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి వచ్చిన దాదాపు 30 వేల మంది మహిళలు పాల్గొన్నారు. ఎల్‌బి స్టేడియంలో ఒకవైపు రంగురంగుల పూలతో కూర్చిన దాదాపు 30 అడుగుల ఎతె్తైన ‘మహాబతుకమ్మ’ కమనీయంగా కనిపిస్తుంటే, మరోవైపు పండుగ అలంకరణలతో వచ్చిన మహిళలతో స్టేడియం కళకళలాడింది. సాయంత్రం 4నుండి 6 గంటల వరకు ఎల్‌బి స్టేడియం మహాబతుకమ్మ వేడుకలతో పాటు మహిళల కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరారింది. మహాబతుకమ్మకు సాయంత్రం పూజలు తర్వాత మహిళలు మూకుమ్మడిగా బతుకమ్మ ఆట ఆడారు. సిఎం కెసిఆర్ కూతురు, ఎంపీ కల్వకుంట్ల కవిత మహిళలందరితో కలిసి బతుకమ్మ ఆటలో
పాల్గొన్నారు. సాయంత్రం దాదాపు ఐదుగంటల సమయంలో కవిత ఎల్‌బి స్టేడియంలోకి రాగానే మహిళలంతా హర్షద్వానాలు తెలిపుతూ చప్పట్లు కొట్టారు.
రాష్ట్ర సాంస్కృతిక శాఖ, జాగృతి సంస్థ సంయుక్తంగా మహాబతుకమ్మ నిర్వహించాయి. తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ 31 జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ఎల్‌బి స్టేడియంలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. ఎక్కడైతే మహిళలకు గౌరవం ఉంటుందో అక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా కొనసాగతాయన్నారు. మహిళాభివృద్ధి, మహిళల సంక్షేమం కోసం సిఎం చంద్రశేఖరరావు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి మహిళలు కష్టపడ్డారని, అలాగే సిఎం కెసిఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణను సాధించడంలోనూ మహిళలు అహర్నిశలు పనిచేయాలని కోరారు. బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహించేందుకు ఎంపీ కవిత తీసుకున్న చొరవ ప్రశంసనీయమన్నారు. బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహిస్తున్నందు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మ సందర్భంగా మహిళలందరికీ అభినందనలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు.
బ్రహ్మకుమారీల భాగస్వామ్యం
తెలంగాణ, ఆంధ్రతో పాటు దాదాపు 15 రాష్ట్రాల నుంచి వచ్చిన బ్రహ్మకుమారీలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ బికె కుల్దీప్ మాట్లాడుతూ సమాజంలో శాంతి నెలకొనేందుకు మనమంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదని, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
28 న ప్రపంచ రికార్డుకు కసరత్తు
‘సద్దుల బతుకమ్మ’ సందర్భంగా ఈనెల 28న ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఎల్‌బి స్టేడియం ముస్తాబవుతోంది. బతుకమ్మ పండగలో ప్రధానంగా ఉపయోగించే ‘తంగేడు’ పూవు ఆకారంలో దాదాపు మూడువేల మంది మహిళలు పాల్గొనడం, ఒకేసారి వేలాది మహిళలు బతుకమ్మలో పాల్గొంటూ ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
మంగళవారం ఎల్‌బి స్టేడియంలో జరిగిన మహాబతుకమ్మ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో మంగళవారం 30వేల మంది మహిళలతో నిర్వహించిన మహా బతుకమ్మ దృశ్యం