రాష్ట్రీయం

కల్పవృక్ష వాహనంపై మలయప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 26: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై శ్రీ రామజన్నార్ స్వామివారి అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9గంటలకు స్వామివారు కల్పవృక్షవాహనంపై ముందు కదులుతుండగా వాహనం ముందు గజరాజులు, వృషభ, అశ్వ, పదాతి దళాలు ముందుకు సాగాయి. భక్తజన బృందాలు, చెక్క్భజనలు భక్తి పారవశ్యంతో స్వామివారిని కీర్తిస్తు నర్తించారు. జీయ్యంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు పట్టారు. సురులు, అసురులు అమృతం కోసం సాగించిన క్షీరసాగర మధనంలో ఉద్భవించిన వస్తువుల్లో కల్పవృక్షం కూడా ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటిని ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధుల్లో భక్తులకు తనివితీరా దర్శనమిచ్చారు. అంటే కల్పవృక్ష వాహనంపై స్వామివారిని దర్శించుకున్న భక్తుల వాంఛలను తీరుస్తాడన్నది ప్రతీతి. రాత్రి సర్వభూపాల వాహనంపై సర్వేశ్వరుడు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

చిత్రాలు..తిరుమలలో మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయప్రదానం చేస్తున్న మలయప్ప
*మంగళవారం రాత్రి సర్వభూపాల వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతున్న మలయప్పస్వామి