రాష్ట్రీయం

కాత్యాయనిగా శ్రీశైల భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 26: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ భ్రమరాంబాదేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు హంస వాహన సేవ నిర్వహించారు. శ్రీ భ్రమరాంబను ప్రత్యేక పూలు నూతన వస్త్రాలతో కాత్యాయనిదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను హంస వాహనంపై ఆశీనులనుచేసి హారతులు ఇచ్చారు.
రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతుల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆది దంపతులను దర్శించుకుని పునీతులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పుష్పపల్లకి సేవ విశేషంగా ఆకట్టుకుంది. గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పపల్లకిపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేయించి హారతులు ఇచ్చారు. 18 రకాల పుష్పాలను ఇందుకోసం వినియోగించారు. పుష్పపల్లకి సేవను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.