రాష్ట్రీయం

మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 26: ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ఆరో రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్టి మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉండటంతో అక్కడక్కడ చినుకులు పడినప్పటికీ వేలాది మంది భక్తులు లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, సౌభాగ్య, సంతాన, గజ లక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో అమ్మవారికి మేల్కొలుపు పలికి మూడు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. మహాకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి స్వరూపిణి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ.. మహాలక్ష్మీదేవి కూడా తానేనని చెప్పకనే చెబుతున్నది. ముగురమ్మల మూలపుటమ్మగా ఆమె భక్తజనుల సేవలందుకుంటున్నది. ఆమె కరుణ అపారం, అందుకే ఆమెను కరుణా లక్ష్మీదేవి ప్రతి రూపానికి గుర్తుగా అష్టలక్ష్ములను ప్రతిష్టించారు.