రాష్ట్రీయం

నయా పైసా పెంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు చరమ గీతం పాడామని, మిగులు విద్యుత్ కారణంగా భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండో దశ సంస్కరణలు ఫలాలు ప్రజలు అందిస్తున్నామని, మూత పడిన పరిశ్రమలు తెరచుకున్నాయని తెలిపారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం బహిరంగ లేఖను గురువారం రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రియాతి ప్రియమైన రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. పల్లెలన్నీ సిరి సంపదలతో విలసిల్లాలని మనసారా కోరుకుంటునన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆనందమయ జీవనాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నానన్నారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజల సేవకే నా జన్మను అంకితం చేస్తున్నానన్నారు. ప్రజలు ఇచ్చిన దీవెనలతోనే, ఆ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రజలందరూ గర్వించే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నానన్నారు. పాలనాదక్షుడికే రాష్ట్ర పగ్గాలు ఇచ్చామన్న మీ సంతృప్తికి తగ్గట్లుగా, అలసట లేకుండా పని చేస్తున్నానన్నారు. అయినా, ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుత పురోగతిని ఇంకా పరుగెత్తించాలన్నారు. అందరూ ఇప్పుడిచ్చినట్లుగానే, భవిష్యత్‌లోనూ మీ అండదండలు, దీవెనలు ఇవ్వాలని కోరుతున్నానని’ ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు.
ఈ మూడేళ్లలో సాధించిన ‘విద్యుత్ విజయం’ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు. భారీ రెవెన్యూ లోటు, లక్షల కోట్ల అప్పుతోనే కాకుండా 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చి, నిష్కర్షగా కక్షగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెళ్లగొట్టారన్నారు. నిర్దాక్షిణ్యంగా, కర్కశంగా రోడ్డున పడేసి అనాధగా మారిన రాష్ట్రాన్ని నలిపివేయాలని అప్పటి పాలకులు కుట్ర పన్నారన్నారు. ఘన కార్యం సాధించినట్లు ‘పవర్ హాలిడేస్’ పేరిట వారంలో మూడు రోజులపాటు కరెంటు కోతలు విధించారన్నారు. ఫలితంగా వేలాది పరిశ్రమలు మూలనపడ్డాయన్నారు. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. జనజీవన స్రవంతి తలకిందులైందన్నారు. రాష్ట్రం ఒక్క 2013లోనే కరంటు కోతల కారణంగా
రూ.25వేల కోట్ల రాబడిని కోల్పోయిందన్నారు. ప్రజలు తల్లడిల్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
అలాంటి పరిస్థితిల్లో మీరు నాపై ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి పదవినిచ్చారన్నారు. పదవి చేపట్టిన వెంటనే తాను దృష్టి పెట్టి తొలి ప్రాధాన్యతనిచ్చింది విద్యుత్ రంగానికేనన్నారు. ఎలాంటి తాత్సారం చేయకుండా విద్యుత్ రంగంలో రెండో దశ సంస్కరణలకు శ్రీకారం చుట్టానన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దానన్నారు. చరిత్రలో తొలిసారి నిరంతర కరెంటు సరఫరాను అమలు చేశామన్నారు. కరెంటు కోతలకు కళ్లెం వేశామన్నారు. విద్యుత్ సరఫరా పంపిణీ నష్టాలను సింగిల్ డిజిట్ శాతానికి దింపామన్నారు. సోలార్, పవన విద్యుత్‌ను ప్రోత్సహించామన్నారు. అంతా మెచ్చుకునే విధంగా ఇంధన పొదుపు, సంరక్షణ విధానాలను అమలు చేశామన్నారు. ఈ విజయంతో లభిస్తున్న ఫలాలు ప్రజలకే చెందాలన్నది నా సంకల్పమన్నారు. అందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఒక్క పైసా పెంచే ప్రసక్తి లేదన్నారు. దీనికి తిరుగు లేదన్నారు. అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మ అనుగ్రహంతో విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రకటన చేయిగలిగానన్నారు. విద్యుత్ మిగులు సాధించి కరెంటు కోతలకు చరమగీతం పాడటంతో మూతపడ్డ పరిశ్రమలు తెరుచుకున్నాయని, ఉపాధి కోల్పోయిన కుటుంబాలు పనిలో పడ్డాయన్నారు. జన జీవన స్రవంతి గాడిన పడింది.. రాష్ట్రం తెరిపిన పడింది.. అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా కరెంటు ఇచ్చినప్పుడే నాకు తృప్తి.. అప్పటివరకూ విశ్రమించను.. నేను గర్వపడేది, ఆనందించేది ఇంధన రంగమేనని వ్యాఖ్యానించారు. పల్లెలన్నీ సిరి, సౌభాగ్యాలతో కళకళలాడాలంటే ఇంధన, జలభద్రతలే ముఖ్యం. అందుకు ‘స్మార్ట్ పవర్ గ్రిడ్’ అనే విప్లవాత్మక విధానానికి నాంది పలికానన్నారు. అత్యంత చవకైన నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవ్వాలని తపన పడుతున్నానన్నారు.
జల సిరులు గలగలమంటేనే ప్రతి గడపలోనూ ఆనందం తాండవిస్తుందన్నారు. అందుకే ‘జలసిరి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ‘జలహారతి’లో నదీమ తల్లులకు ఒక పండుగలా కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. అందరికీ జల భద్రతలో భాగమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018కల్లా గ్రావిటీ విధానంలో పోలవరం కుడి, ఎడమ కాల్వల ద్వారా గోదావరి వరద జలాలను మళ్లించాలన్నారు. తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటూ కరవు కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న ప్రాంతాలకు గుక్కెడు నీళ్లు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల గొంతు తడిపి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. పోలవరం నిర్మాణం ద్వారా తరచుగా వరద బారిన పడుతున్న ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు భద్రత కల్పిస్తామన్నారు. చరిత్రలో తొలిసారి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. పట్టిసీమ ద్వారా ఏడాది వ్యవధిలోనే గోదావరి జలాలను రప్పించి కృష్ణాడెల్టాలోని ప్రతి ఇల్లూ ధాన్యసిరులతో కళకళలాడేలా చేశామన్నారు.
‘అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా పని చేస్తున్నా. అవకాశం వచ్చిన ప్రతిసారీ నాపట్ల నమ్మకాన్ని ప్రజలు వెల్లడిస్తున్నారు. నాపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఇంకా బాధ్యతను పెంచుతున్నారు. భవిష్యత్‌లోనూ ఇదే పునరావృతమవుతుంది. నేను నా ధ్యాసను మరల్చను. నేను ముఖ్యమంత్రిని అయినా మీ సేవకుడినే. నాకు వచ్చిన అధికారం, శక్తి సామర్ధ్యాలు, నా ప్రణాళిక, నా ఆలోచనలు, నా ప్రతి అడుగు, సమస్తం ప్రజల కోసమే. ఇప్పుడు 60 శాతం సంతృప్తిగా ఉన్న ప్రజలు 80 శాతం సంతృప్తి చెందేవరకూ నేను విశ్రమించను. అందుకే మీ సహకారాన్ని అర్థిస్తున్నానని’ చంద్రబాబు నాయుడు అన్నారు.