రాష్ట్రీయం

ఆగని మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 28: అనంతపురంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మరో నలుగురు రోగులు మృతి చెందారు. బుధవారం 9 మంది రోగులు మృతి చిందగా, అర్ధరాత్రి మరొకరు చనిపోయారు. తాజాగా గురువారం మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా రోగుల బంధువుల్లో ఆందోళన నెలకొంది. ప్రతిరోజు పెద్దసంఖ్యలో రోగులు చనిపోతుండడంతో ఆసుపత్రిలో వైద్యసేవలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుళ్ళాయప్ప(40), ఉమాదేవి(30), హనుమక్క(80), కొండమ్మ(60) మృతి చెందారు. ఒకేసారి ఇంతమంది ఎందుకు చనిపోతున్నారన్నదానిపై అధికారులు, వైద్యులు సరైన వివరణ ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యాధి ముదిరిన తరువాతే రోగులు సర్వజన ఆసుపత్రికి వస్తున్నారని, తాము సరైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు అంటున్నారు. కాగా ఊపిరిత్తులకు సంబంధించిన వ్యాధులు, చిన్నపిల్లల విభాగం, ప్రసూతి విభాగం, నవజాతి శిశు వైద్య కేంద్రం, సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కాగా ఇవి సాధారణ మరణాలేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్ తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఊపిరిత్తుల వ్యాధులు, ఫినాయిల్ తాగిన వారు, ఇతర వ్యాధిగస్త్రులని తెలిపారు.