రాష్ట్రీయం

మొదలైన కౌంట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 18: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత ఐదో క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.31 గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ నింగిలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 9.31కు ప్రారంభమైంది. రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1ఇ భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని నాల్గో దశ, రెండో దశల్లో ఇంధనం నింపే కార్యక్రమాన్ని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇంధనం సహా నైట్రోజన్, హీలింగ్ గ్యాస్‌లను శాస్తవ్రేత్తలు విజయవంతంగా నింపారు. నావిగేషన్ సేవలకు ఉపయోగించే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది విజయవంతమైతే నావిగేషన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1ఇ ఉపగ్రహ బరువు1425 కిలోలు. ఇది భారతదేశం, దానిచుట్టూ 15 వందల కిలోమీటర్ల విస్తీర్ణం వరకు దిక్సూచిలా పనిచేస్తోంది. నింగిలోకెళ్లిన తరువాత 20 నిమిషాల్లో రాకెట్‌తో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. దీనిలో అమర్చిన ఎల్-5 బ్యాండ్, ఎస్‌బ్యాండ్ పౌనఃపున్యాలతో ఉపగ్రహం పనిచేస్తోంది. అందులో అత్యంత కచ్చితంగా పనిచేసే రుబిడిఎం అనే గడియారం కూడా కీలకమైంది. ఉపగ్రహంలో ఉండే సిబ్యాండ్ ట్రాన్స్‌ఫాండ్ ఉపగ్రహవ్యాప్తిని తెలియజేసేందుకు ఉపకరిస్తుంది. దేశ అవసరాల నిమిత్తం తయారు చేసిన ఉపగ్రహ వ్యవస్థ పరిధి దేశం చుట్టూ 15 వందల కిలోమీటర్ల వరకు స్థితి, దిశలను నిర్ధిష్టముఖంతో తెలుపుతుంది. అన్ని రకాల శీతోష్ణస్థితుల్లోనూ అక్కడ ఉండే ఫ్లాట్‌ఫారాల నుంచి 24 గంటలూ సేవలందించనుంది. అంతరిక్ష ఉపగ్రహాలు, వాటి తాలుకు సంకేతాలు, భూవిభాగం, వినియోగదారుని విభాగం నిర్ధిష్టంగా తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. భూమధ్య రేఖ దళానికి తూర్పున 31 డిగ్రీల వాలుతో ఉండే కక్ష్యలోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా సామాన్య ప్రజలకు ఎస్‌పిఎస్ నిర్ధిష్ట స్థానాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంతేగాకుండా భూ, జల, వాయు మార్గాలకు స్థితి, స్థాన దిశలను తెలుసుకోవడమేగాక వాహన చోదకులు దృశ్య, శ్రవణ విధానాల్లో దిశా నిర్ధేశం చేయడానికి, ఖచ్చిత సమయం కనుగొనడానికి చరవాణితో ఈ ఉపగ్రహాన్ని అనుసంధానం చేయడంతో భూగోళానికి చెందిన అన్ని విషయాలను కనుగొనేందుకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఇది ఐదో ప్రయోగం. ఇంతవరకు చేపట్టిన నాలుగు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీన్ని కూడా విజయవంతం చేసేందుకు శాస్తవ్రేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 41 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న అనంతరం పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 9.31 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది.

చిత్రం... షార్ ప్రయోగ వేదికపై నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగావున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్