రాష్ట్రీయం

ఖరీఫ్ ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 28: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా, దళారుల హవాకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు భరోసా ఇవ్వనున్నాయి. దళారుల నుండి రైతులను రక్షించడానికి తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ ఖరీఫ్ సీజన్ నుండి అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభం కానున్నాయి. కనీస మద్దతు ధరను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తేమ యంత్రాలను రైతుల వద్దకు చేర్చే పనిలో అధికారులున్నారు. ధాన్యాన్ని తూచేందుకు అవసరమైన తూకాలు, కొలతల పరికరాలు, ధాన్యం ఆరబోత యంత్రాలు, గోనె సంచులను రైతుల కళ్ళాల వద్దకు నేరుగా పంపుతున్నారు. ధాన్యంలో తేమ శాతాన్ని నిర్ధారించుకోవడానికి సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఫోన్ చేసిన పక్షంలో వెంటనే యంత్రాన్ని తీసుకువచ్చి, అక్కడికక్కడే పరిశీలిస్తారు. తేమ, రాళ్లు తొలగించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చిన పిమ్మట మద్దతు ధరను నిర్ధారిస్తారు. కాగా ధాన్యం కొనుగోళ్ళలో దళారులు, బ్రోకర్ల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కారణంగానే దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు గాను 284 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. వెలుగు ద్వారా 61, డిసిఎంఎస్ ద్వారా 15, పిఎసిఎస్‌ల ద్వారా 208 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తారు. జిల్లాలో 2,23,926 హెక్టార్లలో వరి సాగు చేశారు. మొత్తం 10,95,838 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు రావచ్చని అంచనావేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం గ్రేడ్-ఎ ధాన్యానికి క్వింటాలుకు రూ.1590, 75కిలోలకు రూ.1192.50 వంతున చెల్లిస్తారు. సాధారణ రకం క్వింటాలుకు రూ.1550, 75 కిలోలకు రూ.1162.50 వంతున చెల్లిస్తారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కంప్యూటర్, యుపిఎస్, స్కానర్, టార్పాలిన్లు, తేమ యంత్రాలు, తూనిక యంత్రాలను తక్షణం ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అర్ధమయ్యే రీతిలో అన్ని రకాల సూచనలతో బ్యానర్లు ఏర్పాటుచేసి, కరపత్రాలు ముద్రించి ప్రచారంచేయనున్నారు.