రాష్ట్రీయం

డబుల్ ధమాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సింగరేణి కార్మికులకు 2016-17 సంవత్సరం బోనస్‌తో పాటు, దీపావళి బోనస్‌లను కలిపి శుక్రవారం చెల్లిస్తామని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లాభాల బోనస్‌గా సింగరేణి లాభాల్లో 25 శాతం కార్మికులకు ఇస్తున్నామని, ఈ మొత్తం 98.84 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. దీపావళి
బోనస్ మొత్తం 336 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. లాబాల బోనస్‌గా సగటున ఒక్కో కార్మికుడికి 15 వేల నుండి 20 వేల రూపాయల వరకు ఇస్తున్నామని, దీపావళి బోనస్‌గా ఒక్కొక్కరికి 57 వేల రూపాయలు చెల్లిస్తామన్నారు. అంటే ఒక్కో కార్మికుడికి సరాసరిన 72 వేల రూపాయల నుండి 77 వేల రూపాయల వరకు బ్యాంకుల్లోని ఖాతా ల్లో శుక్రవారం జమ చేస్తామన్నారు. ఇప్పటికే దసరా పండగ అడ్వాన్సుగా ఒక్కో కార్మికుడికి 25 వేల రూపాయలు చెల్లించామన్నారు. ఇందుకోసం 120 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమచేశామని వివరించారు. తెలంగాణ రాకముందు లాభాల బోనస్‌గా 18 శాతం చెల్లించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014-15 లో 21 శాతం, 2015-16 లో 23 శాతం చెల్లించగా, 2016-17 లో దీన్ని 25 శాతానికి పెంచామని గుర్తు చేశారు.