రాష్ట్రీయం

సౌర విద్యుత్‌లో టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సౌర విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి తెలంగాణ ముందుకు దూసుకు వచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2,792 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. రాజస్ధాన్ 2,219 మెగావాట్లు ఉత్పత్తి చేయగా గుజరాత్ 1,384 మెగావాట్లు ఉత్పత్తి చేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ సర్కార్ రానున్న అరు నెలల్లో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన చేసేందుకు నిర్ణయించింది. దీంతో సౌర విద్యుత్ ఉత్పాదన 3 వేల మెగావాట్లు దాటుతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇంతే కాకుండా రానున్న మూడు, నాలుగేళ్లలో 4,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన చేసే స్ధాయికి చేరాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సౌర విద్యుత్ విధానానికి అనుగుణంగా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే బిడ్డర్స్ కూడా ఆసక్తి చూపించడం వల్ల విద్యుత్ ఉత్పాదన ఆశించిన స్ధాయి కంటే అధికంగా చేపట్టగలిగామని చెబుతున్నారు. తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ పార్కు ఏర్పాటు చేసి అక్కడే అన్ని యూనిట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించిన ప్రభుత్వం తర్వాత పునరాలోచించి అన్ని యూనిట్లు ఒక చోట ఏర్పాటు చేయడం వల్ల ట్రాన్స్‌మిషన్ నష్టం భరించే కన్నా వికేంద్రీకరణ చేయడం మంచిదని భావించి పలు చోట్ల సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఫలితాలను ప్రభుత్వం రాబట్టింది. సౌర విద్యుత్‌కు తోడుగా పవన విద్యుత్ 4,500 మెగావాట్లను ఉత్పత్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో సౌర విద్యుత్ వాడకాన్ని ఎత్తిపోతల పథకాలకు, పరిశ్రమలకు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.