రాష్ట్రీయం

మొక్కజొన్నకు మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించనున్నట్టు మంత్రి హరీశ్‌రావు గురువారం ప్రకటించారు. మద్దతు ధరతో పాటు అకాల వర్షానికి తడిసిన మక్కలను కొనుగోలు చేయాలని వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలియగానే వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్‌తో మంత్రి మాట్లాడారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా వారి సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. దీంతో జాయింట్ కలెక్టర్ హుటాహుటిన మార్కెట్ యార్డుకు చేరుకొని రైతులు, వ్యాపారులతో చర్చించినట్టు మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తడిసిన మక్కలకు క్వింటాల్‌కు రూ.150 అదనంగా చెల్లించాలని రైతులు డిమాండ్ చేయడంతో ఆ మేరకు ఇవ్వడానికి వ్యాపారులను ఒప్పించినట్టు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంత్రి జోక్యంతో తమ సమస్య పరిష్కారం అయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.