రాష్ట్రీయం

‘గిన్నిస్’కు వరుణుడి బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం చేసిన ప్రయత్నానికి వర్షం ‘బ్రేక్’ వేసిం ది. రాష్ట్ర రాజధానిలోని ఎల్‌బి స్టేడియంలో దాదాపు ఆరువేల మంది మహిళలను తంగేడుపూవు ఆకారంలో నిలబెట్టాలని, అలాగే మూడువేల మందిమహిళల చేత అతివేగంగా బతుకమ్మను పూలతో రూపొందించాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రయత్నించింది. ఈ రెండింటినీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదు చేయించాలని ప్రయత్నించారు. గిన్సీ న్ బుక్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం వీక్షించేందుకు వచ్చారు. సద్దుల బతుకమ్మలో పాల్గొనేందుకు, రికార్డు నెలకొల్పేందుకు ఉదయం 10 గంటల నుండి మహిళలు ఎల్‌బి స్టేడియానికి రావడం మొదలైంది. అయితే నిర్ణీత సమయానికి భారీ వర్షం కురిసింది. దాంతో తంగేడుపూవు ఆకారంలో నిలబడేందుకు, వేగంగా బతుకమ్మను పేర్చేందుకు వీలు కాలేదు. దాంతో రెండు రికార్డులు నెలకొల్పేందుకు విఘాతం కలిగింది. నవంబర్‌లో బతుకమ్మ పేరుతో మరోపర్యాయం గిన్నీస్ రికార్డు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తామని సాంస్కృతిక శాఖ కార్యదర్శి
బుర్రావెంకటేశం ప్రకటించారు. గురువారం జరిగిన బతుకమ్మ సంబరాలను గిన్నీస్ రికార్డుల్లో నమోదు చేయడం లేదని సంబంధిత ప్రతినిధి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. రాజధానిలో గురువారం ఉదయం నుండే వర్షం ప్రారంభమైంది. సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్‌బినగర్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, అబిడ్స్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో ఒక మోస్తురు నుండి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు రాజధానిలోని ఇతర జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురిసింది.

చిత్రం..ఎల్‌బి స్టేడియంలో గురువారం జరిగిన బతుకమ్మ వేడుకలు