రాష్ట్రీయం

నవంబర్‌లో డిజిపిల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: నవంబర్ చివరి వారంలో ఆలిండియా డీజీపీల సదస్సు జరుగనుంది. మధ్యప్రదేశ్ వేదిక కానున్న ఈ సదస్సులో ఆలిండియా డీజీపీలు పాల్గొననున్నారు. ఈసారి ఏజెండాలో దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ సమస్యలు, అంతర్గత భద్రత, ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వం అందించే ఆధునీకరణ నిధులు వంటి అంశాలను రూపొందించినట్టు సమాచారం. ఈ సదస్సు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరుగనున్నట్టు తెలిసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు ఈ సదస్సులో పాల్గొంటారు. సదస్సుకు సంబంధించి ఇటీవల ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశాలు జరిగాయి. ఈ భేటీకి రాష్ట్ర డీజీపీతోపాటు అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న శాంతిభద్రతల పరిస్థితి, మావోయిస్టు కార్యకలాపాలు, ఐసిస్ కార్యకలాపాలు, ఉగ్రవాద నియంత్రణ చర్యలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, గిరిజన యువతకు కల్పిస్తున్న శిక్షణ తదితర అంశాలన్నింటిపై నివేదిక సమర్పించారు. పోలీస్ ఆధునీకరణకు సంబంధించి వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించనున్నట్టు సమాచారం.