రాష్ట్రీయం

ఏప్రిల్ 8న ఐఐటి మెయిన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే అడ్వాన్స్ పరీక్షను మే 20న నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్స్ బోర్డు నిర్ణయించింది. అడ్వాన్స్ పరీక్ష నిర్వహణకు అనుగుణంగా మెయిన్స్ ఫలితాలను ఏప్రిల్ 30 కంటే ముందే విడుదల చేస్తారు. అడ్వాన్స్ పరీక్ష ఫలితాలను జూన్ 11న వెల్లడించనున్నారు. జూలై మొదటి వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి ఏటా 11 లక్షల మంది మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నారు. అందులో రెండున్నర లక్షల మందిని అడ్వాన్స్ పరీక్షకు అనుమతిస్తున్నారు. గత ఏడాది జెఇఇ పరీక్షను ఐఐటి చెన్నై నిర్వహించగా ఆ బాధ్యతను ఈ ఏడాది ఐఐటి కాన్పూర్‌కు అప్పగించారు. దేశంలోని 23 ఐఐటిలు, ట్రిపుల్‌ఐటిలు, ఐఐఎస్‌ఎంలతో పాటు మొత్తం 97 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఈ ర్యాంకుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ 97 విద్యాసంస్థల్లో 600 ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నారు. గత ఏడాది 11వేల సీట్లను భర్తీ చేయగా ఈ ఏడాది సీట్ల సంఖ్య 14వేలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ పరీక్షను ఈ ఏడాది నుండి కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తారుస. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలలో మెయిన్స్ నిర్వహిస్తుండగా అడ్వాన్స్ పరీక్షను విజయవాడ, విశాఖపట్టణంలలో నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణలో మెయిన్స్‌ను హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో నిర్వహిస్తుండగా, అడ్వాన్స్ పరీక్షను హైదరాబాద్, వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను నవంబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. దరఖాస్తులు డిసెంబర్ 1 నుండి స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి గడువు జనవరి 16 వరకూ ఉంటుంది. మార్చి రెండో వారంలో అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. పరీక్ష ఏప్రిల్ 8న నిర్వహించి ఏప్రిల్ 30 నాటికి ఫలితాలను విడుదల చేస్తారు.