రాష్ట్రీయం

కూలిన శిక్షణ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. దీంతో చెలరేగిన మంటల్లో కాలి బూడిదయింది. మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని అంకిరెడ్డిపల్లి, పెద్దమ్మ చెరువు వద్ద గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. హకీంపేట్ వైమానిక శిక్షణ కేంద్రం నుంచి విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో పైలట్‌తో పాటు మరో ఇద్దరు శిక్షకులు ఉన్నారు. వీరంతా పారాచూట్ల సహాయంతో సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. పెద్దమ్మ చెరువు సమీపంలోని గుట్టల మధ్య కూలిన విమానం కొన్ని క్షణాల్లోనే మంటల్లో కాలిపోయింది. పరిసర ప్రాంతాల వారు భయాందోళనకు గురయి పోలీసులు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. కాగా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే సరికి శిక్షణ విమానం పూర్తిగా కాలిపోయింది. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం, విమానం కాలిపోయిన సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు హకీంపేట్ శిక్షణ కేంద్రం అధికారులు తెలిపారు.