రాష్ట్రీయం

లాభసాటి సాగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 29: భూమినే నమ్ముకుని ఆరుగాలం కష్టపడే రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అందరం కలసి పనిచేద్దామని సిఎం చంద్రబాబు అన్నారు. సమష్టి శ్రమ ఫలితం ప్రపంచానికి రోల్‌మోడల్ కావాలన్నారు. శుక్రవారం సచివాలయంలో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సాగును లాభసాటిగా మార్చి, వ్యవసాయానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందన్నారు. నవంబర్ 15నుంచి 17 వరకూ విశాఖలో జాతీయస్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్న సమయంలో బిల్‌గేట్స్ దానికి హాజరవుతుండ డంపై బాబు హర్షం వ్యక్తం చేశారు. సదస్సు తీరుతెన్నులు, లక్ష్యాలపై ఆయన ఫౌండేషన్ ప్రతినిధులతో చర్చించారు. చిన్న, సన్నకారు రైతుకు వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు కావాల్సిన సహకారం అందించాలన్న తన సూచనకు సానుకూలంగా స్పందించినందుకు గేట్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా భారత్‌లో తాము నాల్గవ రాష్ట్రంతో ఒప్పందం చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. ఫౌండేషన్ ఆసియా చీఫ్ డాక్టర్ పుర్వి మెహతా, వరద్‌పాండే, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశమైన సిఎం చంద్రబాబు