రాష్ట్రీయం

పరిశ్రమల మేళా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 29: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 75 పరిశ్రమలు శనివారం విజయదశమి రోజున ప్రారంభంకానున్నాయి. సిఎం, అధికార యంత్రాంగం గత రెండేళ్ల నుంచి చేసిన కసరత్తు ఫలించినట్టయింది. నవ్యాంధ్రను దేశంలోనే పారిశ్రామికీకరణలో అగ్రగామిగా నిలిపేందుకు సిఎం చంద్రబాబు 75 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఎఈ) నేడు విజయవాడ నగరంలో ప్రారంభించనున్నారు. కృష్ణాజిల్లా వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ క్లస్టర్లో ఏర్పాటు చేయబోయే 75 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలను సిఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో నూతనంగా తమ కంపెనీ ఉత్పత్తులను ప్రారంభించబోయే కంపెనీలతో ఏరోస్పేస్ పరికరాలు, మిషనరీ స్పేర్స్, ప్రెస్ టూల్స్, కాప్టివ్ ఎక్విప్‌మెంట్స్, గృహోపకరణ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీరపనేనిగూడెంలో ఈ పరిశ్రమల స్థాపన వల్ల ప్రత్యక్షంగా 2,600 మందికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వెల్లడించింది. అమరావతి రాజధాని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పరిశ్రమలు
ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 2016లో సిఎం చంద్రబాబు బ్రిటన్ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతూ, అమరావతి ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఎఐఎ) ఏర్పాటైంది. సుమారు 30 ఉత్పత్తి సంస్థలతో ఏర్పాటైన ఈ గ్రూపు ప్రస్తుతం 145 మంది సభ్యులతో బలమైన వ్యవస్థగా రూపుదిద్దుకుంది. ఈ సంస్థలన్నీ అతి త్వరలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు సంతతికి చెందిన పారిశ్రామిక వేత్తలను ఒక నెట్ వర్క్‌గా ఏర్పాటు చేయడానికి ఎపిఎన్‌ఆర్‌టి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అత్యుత్తమ విధానాలు రూపొందించడంలో ప్రభుత్వానికి తమ సహాయ, సహకారాలు అందించడంలో ఎపిఎన్‌ఆర్‌టి కృషి చేస్తుంది. తొలిదశలో పరిశ్రమల స్థాపనకు 145 కంపెనీలు ముందుకు రాగా లాటరీ విధానం ద్వారా ఎఐఎ 75 కంపెనీలను ఎంపిక చేసి వాటికి 52 ఎకరాల్లో 75 ప్లాట్స్‌ను కేటాయిచారు.
వీరపనేనిగూడెంలో 75 ఎంఎస్‌ఎమ్‌ఈ ఇంజనీరింగ్ క్లస్టర్ యూనిట్లలో డిఫెన్స్/యూరో స్పేస్ కాంపొనెంట్స్ తయారీకి 40 యూనిట్లు, ఎలక్ట్రానిక్స్ విడి భాగాలకు 10 యూనిట్లు, ప్లాస్టిక్స్‌కు సంబంధించి 6 యూనిట్లు, సర్వీస్ ప్రొవైడర్స్‌కి సంబంధించి 4 యూనిట్లు, గృహోపకరణాలు, ఇతర 15 యూనిట్లు ఉన్నాయి. శనివారం విజయవాడ ఎ కనె్వన్షన్ హాలులో దీనికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించి, 75 మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. వారు ఏయే ఉత్పత్తులు చేయబోతున్నారో ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా చేయటం ఇదే ప్రథమం. దీనికి సంబంధించి 250 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. పరోక్షంగా వేల మందికి ఉపాధి రానున్నది. వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ పార్కును ఒక మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా సంవత్సరం లోపు అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.