రాష్ట్రీయం

డేటాకు సెక్యూరిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 29: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ దాడుల నుండి ప్రభుత్వ సమాచారాన్ని కాపాడేందుకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అత్యుత్తమ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. సైబర్ నేరాలపై శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సెకనుకు 12మంది సైబర్ నేరాలకు గురవుతున్నారన్నారు. ర్యాన్సమ్‌వేర్ ద్వారా సైబర్ దాడితో ప్రభుత్వాల దగ్గరున్న సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో ఏపీ ప్రభుత్వం అందరికంటే ముందు ఉందన్నారు. దీనివల్ల సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం కూడా ఎక్కువేనన్నారు. సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ ప్రధాన లక్ష్యాలుగా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ సెక్యూరిటీ కోసం ఇతర దేశాల్లో రూపొందించిన విధి విధానాలు, మన రాష్ట్ర పరిస్థితులు అంచనా వేసి, వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూవేల్స్‌లాంటి ప్రమాదకర గేమ్స్ మరికొన్ని వచ్చే ప్రమాదం కూడా ఉందని, ఇలాంటి సైబర్ ప్రమాదాలను ముందుగానే అంచనావేసి నివారించే స్థాయిలో సెంటర్ ఉండాలన్నారు. సైబర్ క్రైమ్స్ నియంత్రణకు పోలీస్ శాఖ సలహాలు తీసుకుని, సైబర్ సెక్యూరిటీ విధి విధానాలను రూపొందించాలని మంత్రి లోకేష్ సూచించారు.

చిత్రం..ఐటి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి లోకేష్