రాష్ట్రీయం

సింగరేణికి బొనాంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: సింగరేణిలో డిపెండెంట్ పేరిట కాకుండా కారణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తామని సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. డిపెండెంట్ల ఉద్యోగాలను కొందరు కోర్టుల్లో అడ్డుకుంటున్నారని, దీంతో చట్టంలో కొద్దిపాటి మార్పుతో తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా చేస్తే కారణ్య నియామకాలకు ఏ కోర్టూ అభ్యంతరం చెప్పదన్నారు. దీనివల్ల ఒక్క డిపెండెంట్ ఉద్యోగం కూడా పోదని సిఎం హామీ ఇచ్చారు. సింగరేణి ఎన్నికలను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున కార్మికులకు ఏవేం చేయబోతున్నారో వివరాలను తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సిఎం ప్రకటించారు. డిపెండెంట్లకే కాకుండా బినామీ పేర్లతో కొనసాగుతున్న 14నుంచి 19 వేల మంది కార్మికుల ఉద్యోగాలనూ రెగ్యులరైజ్ చేస్తామని సిఎం ప్రకటించారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకునే వారికి రూ. 25 లక్షల ప్యాకేజీ ఇస్తామన్నారు. అది కూడా కాదనుకుంటే నెలవారీగా జీతం తీసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇద్దామనుకుంటే జాతీయ కార్మిక సంఘాలుగా చెలామణీ అయ్యే సంఘాలే అడ్డుకున్నాయని ఆరోపించారు. ‘సింగరేణి ఎన్నికల్లో కార్మికులను ప్రలోభాలకు గురి చేస్తున్నామని చాలామంది పెడబొబ్బలు పెడుతున్నారు. మీ సంఘాల నాయకులు ప్రలోభాలకు లొంగిపోయే అంతటి బలహీనంగా ఉన్నారా?’ అని సిఎం ఏద్దేవా చేశారు. డిపెండెంట్ల పేరిట ఉద్యోగాలు ఇవ్వొద్దని కోర్టు స్టే ఇస్తే ఇదే జాతీయ సంఘాలు స్వీట్లు పంచుకున్నది వాస్తవం కాదా అని కెసిఆర్ నిలదీశారు. రాష్ట్రంలో ఏ మంచి పని చేద్దామన్నా అడ్డుకోవడానికి కొన్ని ముఠాలు ఏర్పడ్డాయన్నారు. ప్రాజెక్టులు, ఉద్యోగాలు, రైతులకు ఏ వర్గానికి మేలు చేద్దామన్నా ఈ ముఠాలు కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నాయన్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. ప్రతీ దానికి అడ్డుపడటం వల్లనే డిపెండెంట్లకు ఏవిధంగానైనా న్యాయం చేయాలని నిపుణుల సలహా మేరకు కారుణ్య నియామకాల పేరిట ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణిని విధ్వంసం చేశాయన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను
అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్, తెదేపాల హయాంలో విఫలమయ్యాయన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనేది ఉద్యమ సమయంలో పుట్టిన సంఘమన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను వదులుకుంటామని ఈ సోకాల్డ్ జాతీయ కార్మిక సంఘాలే యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నాయని సిఎం గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తనను తాను అవిష్కరించుకుంటున్న సమయంలో విపక్ష పార్టీలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెట్టే అవసరం తమకు లేదన్నారు. తెరాస పార్టీ ప్రతి ఎన్నికల్లో అప్రతిహతంగా విజయం సాధిస్తున్న పరంపరలోనే సింగరేణిలో విజయ దుందుభి మోగించబోతుందన్నారు. వివిధ సంస్థల నుంచి ఇప్పటికే సమాచారం తెప్పించుకోగా సింగరేణిలోని 11 డివిజన్లకు 11 డివిజన్లలో నూటికి నూరుశాతం విజయం సాధించి తీరుతామన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆశించిన విధంగా పని చేయలేదన్న మాట వాస్తవమేనన్నారు. ఇకనుంచి ప్రతీ నెల రెండు గంటలపాటు సింగరేణికి కేటాయించి ఎప్పటికప్పుడు సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పోతామన్నారు.
సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణాల కోసం రూ. 6 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. కార్మికులకు ఇప్పటికే ఏటా రూ.175 కోట్ల వృత్తి పన్ను రద్దు చేశామన్నారు. ఆదాయ పన్ను రద్దు చేయడానికి కూడా కృషి చేస్తామన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని సిఎం హామీ ఇచ్చారు.
* బయ్యారం గనులు సింగరేణికే...
సింగరేణిని ఇతర రంగాల్లోనూ ముందుడేలా చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బయ్యారం గనులను కూడా సింగరేణికే అప్పగిస్తామన్నారు. బయ్యారం గనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని పార్లమెంట్‌లో కేంద్రంపై వత్తిడి తీసుకొస్తామన్నారు.

చిత్రం..ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్