రాష్ట్రీయం

కెసిఆర్ మాయలో పడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: మరోమారు మోసం చేసేందుకు చూస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మాయలో పడొద్దని అఖిలపక్ష నాయకులు సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ ని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో టిపిసిపి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సిపిఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. మూడున్నర ఏళ్లుగా అధికారంలోనే ఉన్న కెసిఆర్ ఉద్యమ సమయంలో, 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ కాలేజీ, సింగరేణి కార్మికులకు ఇళ్లు నిర్మిస్తామన్న హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. చట్టంలో లేని హామీలను గుప్పించి కార్మికులను ప్రలోభాలకు గురిచేసి సింగరేణి ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కారుణ్య నియామకాలను వారసత్వ ఉద్యోగాలుగా చెప్పి కార్మికులను మోసం చేయాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగి ఆకస్మికంగా మృతిచెందితే అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేదాన్ని కారుణ్య నియామకం అంటారని.. అది కేవలం సిం గరేణిలో కాక అన్ని శాఖల్లో ఉందని చెప్పారు. ఇలాంటి హామీల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కెసిఆర్ నాగులచవితి రోజు పాములు ఆడించే వాడిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. కెసిఆర్ స్వయంగా సిఎంగా ఉండి.. బిడ్డ గౌరవ అధ్యక్షురాలిగా, కొడుకు, అల్లుడు మంత్రులు గా ఉండి ఇన్నాళ్లూ చేయని పనులు ఇప్పుడు చేస్తామని అనడం వెనుక అంతర్యాన్ని కార్మికులు గుర్తించాలని కోరారు. వారసత్వ ఉద్యోగాలను పరోక్షంగా అడ్డుకున్నది బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత అని ఆరోపించారు.
తండ్రి జీవోలు విడుదల చేస్తే జాగృతిలో కీలకంగా వ్యవహరించిన సతీష్ దానికి వ్యతిరేకంగా కేసు వేశాడని, దానిని టిఆర్‌ఎస్‌తో ఎంతో కాలంగా సాన్నిహిత్యం కలిగిన సత్యంరెడ్డి వాదించి వారసత్వ ఉద్యోగాలు రాకుండా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన విద్యుత్ ప్లాంటు అన్ని కాంగ్రెస్ హయంలో ప్రారంభించినవే అన్న విషయాన్ని కెసిఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్లాంట్లను నిర్మిస్తే ఆ గొప్పతనమంతా తనదేనని కెసిఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని సక్రమంగా చేస్తున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి ఓటమి సింగరేణి ప్రాంతాల్లో మనీ, మద్యం, మటన్‌లను ఎందుకు పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. కెసిఆర్ కుటుంబం వెర్సెస్ తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో కార్మికులు నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామణ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బిఎన్‌రెడ్డి, నర్సింహారావు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో అభివాదం చేస్తున్న అఖిలపక్ష నాయకులు