రాష్ట్రీయం

దసరాకు ప్రత్యేక రైళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 29: దసరా పండుగ సందర్భంగా నడుపుతున్న రైళ్లన్నీ రద్దీగానే నడుస్తున్నాయి. అధికారులు ఊహించని విధంగా రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎన్ని రైళ్లు ప్రవేశపెట్టినా ప్రయాణికులకు ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు. సామాన్యులకు బెర్తు కన్ఫర్మేషన్ అందని ద్రాక్షగా మారిపోతోంది. ఈ పరిస్థితుల నుంచి కొంతవరకైనా ఉపశమనం కల్పించేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ముఖ్య పట్టణాల మధ్య, పలు రాష్ట్రాలను కలపుతూ నడిచే విధంగా వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
విశాఖపట్నం-యశ్వంత్‌పూర్ (06580)
విశాఖపట్నం-యశ్వంత్‌పూర్ (06580) మధ్య నడిచే ప్రత్యేక రైలు అక్టోబర్ 8,15,22,29 తేదీల్లోనూ, అలాగే నవంబర్ 5,12,19,26 తేదీల్లోనూ నడుపుతారు.
యశ్వంత్‌పూర్-విశాఖపట్నం (06579)
యశ్వంత్‌పూర్-విశాఖపట్నం (06579) మధ్య నడిచే ప్రత్యేక రైలు అక్టోబర్ 6,13,20,27 తేదీల్లోనూ, నవంబర్ 3,10,17,24 తేదీల్లో యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరుతుంది. ఇది కృష్ణరాజపురం, వైట్‌ఫీల్డ్, బంగార్‌పేట్, కుప్పం, జోలార్‌పేట్, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం మీదుగా నడుస్తుంది. ఈ రైలులో 11 కోచ్‌లు ఉంటాయి. సెకండ్ ఏసి-1, థర్డ్ ఏసి-2, స్లీపర్ క్లాస్-8, సెకండ్ క్లాస్ లగేజి/ వికలాంగుల కోచ్‌ల సదుపాయం కల్పించారు. ఇదే తరహాలో ఇటీవల కాచిగుడ-విశాఖపట్నం-టాటానగర్ (07438) మధ్య ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. ఇది అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు నడువనుంది. అలాగే టాటానగర్-కాచిగుడ (07439)ల మధ్య మరో ప్రత్యేకరైలు అక్టోబర్ 3 నుంచి పట్టాలెక్కి నవంబర్ 28 వరకు నడుస్తుంది. ఇది దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపురం, ఖుర్ధారోడ్డు, భువనేశ్వర్, కటక్, సుకిండ రోడ్డు, కెందుజాఘర్ తదితర స్టేషన్ల మీదుగా నడుస్తుంది.
ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖ-తిరుపతి (08573) మధ్య మరో ప్రత్యేక రైలు, విశాఖపట్నం-సికింద్రాబాద్ (08501) మధ్య ప్రత్యేక రైలు నడువనుంది. ఇది అక్టోబర్ 3న ఇక్కడి నుంచి బయలుదేరుతుంది.
ముంబై లోకల్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 25 మంది మృతి చెందడంతో ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరిధిలోకి వచ్చే వాల్తేరు, సంబల్‌పూర్, ఖుర్ధా డివిజన్లకు సంబంధించిన ముఖ్య రైల్వే స్టేషన్లను అధికారులు అప్రమత్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, దసరా రద్దీని దృష్టిలోపెట్టుకుని ఎక్స్‌ప్రెస్ రైళ్ళ వద్ద క్యూ లైన్లు నిర్వహించారు.