రాష్ట్రీయం

వైభవంగా ధ్వజావరోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 1: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజైన ఆదివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు భూ వరాహస్వామి ఆలయం ప్రాంతంలో ఉన్న శ్రీవారి పుష్కరిణిలో చక్రధరునికి చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించారు. ఇక శ్రీవారి ఉత్సవాల క్రమంలో 8 రోజుల్లో హుండీ, వగపడి, ఆర్జితం, అద్దెగదుల ద్వారా రూ.24 కోట్ల 43 లక్షల 11 వేల 497 టిటిడికి ఆదాయం లభించింది. గతేడాదితో పోల్చుకుంటే రూ. కోటి 85 లక్షల 73వేలు స్వల్పంగా తగ్గింది. 8 రోజుల్లో 6 లక్షల 21వేల 705 మంది స్వామివారిని దర్శించుకున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 75వేల 367 మంది భక్తుల సంఖ్య తగ్గింది. ఇక 3లక్షల 6 వేల మంది టిటిడి అందించిన అన్నప్రసాదం, అల్పాహారం, కాఫీ, టీలను స్వీకరించారు. 3 లక్షల 6వేల 271 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 76వేల 366 మంది టిటిడి ఏర్పాటు చేసిన వైద్యశాలల ద్వారా వైద్యం పొందారు. 289.27 లక్షల గ్యాలెన్ల నీటిని టిటిడి 8 రోజుల్లో వినియోగించింది. తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సుల్లో 9 లక్షల 92 వేల మంది ప్రయాణం చేశారు. రోజుకు 4 వేల మంది శ్రీవారి సేవకులు తమ సేవలు అందించారు. 26 లక్షల 55 వేల 080 చిన్న లడ్డూలను టిటిడి విక్రయించింది. టిటిడి ఏర్పాటు చేసిన పుస్తక విక్రయశాలలో రూ. 33,11,609 విలువచేసే వివిధ రకాల పుస్తకాలు అమ్ముడుపోయినట్లు టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాస రాజు తెలిపారు. సెప్టెంబర్ 23న ధ్వజారోహణంతో ప్రారంభమై అక్టోబర్ 1న ధ్వజావరోహణంతో ముగిసిన 9 రోజుల్లో స్వామి అమ్మవార్లు 14 వాహనాలపైన బంగారు రథం, దారు రథంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా నాలుగు రోజులపాటు స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం, 6 రోజులపాటు ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక చింతనను నింపే శ్రీవారి వాహనసేవలు, వాహన సేవల ఊరేగింపు ముందు గజ, తురగ, వృషభ, పధాతి దళాలు, కోలాటాలు, చెక్క్భజనలు, వివిధ రకాల వాయిద్యాల మోతలు, కళాకారుల నృత్యప్రదర్శనలు, ఫల, పుష్ప ప్రదర్శనలు, పురాణ ఇతిహాసాలను కంటికి కట్టినట్లుగా చేపట్టిన ప్రదర్శనలు, వివిధ రకాల దేవతల విద్యుత్ దీపాలంకరణలు తిలకించిన భక్తులు మరువలేని మధురానుభూతులను పొందారనడంలో అతిశయోక్తిలేదు. ఏ ఏడాదికి ఆ ఏడాది స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను టిటిడి అత్యంత వైభవంగా నిర్వహిస్తుండటంతో తిరుమల క్షేత్రం 9 రోజులు వైకుంఠపురాన్ని తలపించిందనే చెప్పాలి. మొత్తంమీద స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వైభవంతో తిరుమల క్షేత్రం కూడా పులకించింది.