రాష్ట్రీయం

ఇంటింటా ఎల్‌ఇడి వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 1: ఇంధన శాఖాధికారులు సమర్థ విద్యుత్ వినియోగ ఉపకరణాల ప్యాకేజీని ప్రజలకు సరసమైన ధరలకు అందించడంపై దృష్టి సారించాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్యాకేజీ పథకానికి 15 రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ప్యాకేజీలో ఇచ్చే ఉపకరణాలు విద్యుత్ సమర్థ వినియోగం ద్వారా బిల్లులు తగ్గించేలా ఉండాలని సూచించారు. విద్యుత్ ఉపకరణాల ప్యాకేజీ, సమర్థ ఇంధన వినియోగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై చంద్రబాబు ఆదివారం మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఏ సమాజాభివృద్ధికైనా ఇంధన ఉత్పత్తితో పాటు ఆదా, వనరుల పరిరక్షణ కూడా అవసరమన్నారు. ఇది ప్రపంచమంతటా అవసరమైన విధానమని, మనం సమర్థ విద్యుత్ వినియోగ చర్యలను వినూత్నంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే తక్కువ విద్యుత్‌ను వాడే ఉపకరణాలను ప్రజలకు ఒక ప్యాకేజీ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఈ ప్యాకేజీలో వివిధ సంఖ్యల్లో ఎల్‌ఇడి బల్బులు, ఎల్‌ఇడి ట్యూబ్‌లైట్లు, స్టార్ రేటెడ్ ఫ్యాన్లు ఉండేలా కిట్లు ఉంటాయన్నారు. వారి అవసరాన్ని బట్టి ఆయా సంఖ్యలో ఉన్న ఉపకరణాల కిట్‌ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ప్యాకేజీలోని ఉపకరణాలు మార్కెట్ ధరకంటే తక్కువగా ఉండటమేకాక నాణ్యమైనవై ఉంటాయని, ఉపకరణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు. వీటిని వాడితే ఏ ఇంట్లోనైనా విద్యుత్ బిల్లు తగ్గాల్సిందేనని, ప్యాకేజీ ప్రజా ప్రయోజనమైనదై ఉండాలన్నారు. ప్యాకేజీతో పాటు ప్రభుత్వం ఏపి హడ్కో ద్వారా వినియోగదారులకు కన్సల్టెన్సీ సేవలు అందించే యోచన చేస్తోందని బాబు తెలిపారు. ఉపకరణాలను సులభ వాయిదాల పద్ధతిలో ఇచ్చేందుకు మార్గాలు అనే్వషించాలని సిఎం అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గ్రామీణ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బుధవారం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత కార్యక్రమంలో భాగంగా 35 నుంచి 40 లక్షల ఎల్‌ఈడి
వీధిదీపాలను రాష్ట్రంలోని 13,500 గ్రామాల్లో మూడు దశల్లో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమం అమలైతే పదేళ్లకు రూ.669 కోట్ల ఆదాతో పాటు ఏటా 444 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని వివరించారు. ఈసందర్భంగా ఏపిలో విద్యుత్ ఆదా వివరాలను ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన 2.16 కోట్ల ఎల్‌ఈడి బల్బులు, 44,000 ఎల్‌ఈడి ట్యూబ్‌లైట్లు, 2.55 లక్షల స్టార్ రేటెడ్ ఫ్యాన్ల వల్ల 1750 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని చెప్పారు. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే సమయంలో 564 మెగావాట్ల మేరకు డిమాండ్ తగ్గిడమే, విద్యుత్ ఆదా జరుగుతోందనడానికి నిదర్శనమన్నారు. ఈ ఆదా విలువ రూ.930 కోట్లుగా లెక్కించామన్నారు. ఇందుకు స్పందించిన సిఎం, స్వయం సహాయక సంఘాల్లోని 90లక్షల మంది మహిళలు విద్యుత్ ఆదా గురించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఐసిఎఫ్ అనే అంతర్జాతీయ సంస్థ నివేదికను ప్రస్తావించిన ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయి సాంకేతికత వినియోగం వల్ల 2020 నాటికి ఆ ఏడాది విద్యుత్ డిమాండ్‌లో 35 నుంచి 40 శాతాన్ని ఏపి ఆదా చేయొచ్చన్న విషయాన్ని ప్రస్తావించారు. అందుకు చర్యలు తీసుకోవాలని అదికారులను ఆదేశించారు. ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావు, పట్టణాభివృద్ధి మంత్రి పి నారాయణ, సిఎస్ దినేష్‌కుమార్, సిఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి కె జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ సలహాదారు కె రంగనాథన్, సిఎం ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ట్రాన్స్‌కో సిఎండి, జెన్‌కో ఎండి, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, సిఎం అదనపు కార్యదర్శి రాజవౌళి పాల్గొన్నారు.