రాష్ట్రీయం

ఎన్‌హెచ్‌పై మృత్యుఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, అక్టోబర్ 1: ఆర్టీసీ బస్సు మితిమీరిన వేగం ఆరుగురి ప్రాణాలను హరించింది. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మొద్దులచెర్వు గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా ఆవనిగడ్డ డిపోకు చెందిన ఎపి 16జెడ్ 0216 నెంబరుగల ఆర్టీసీ లగ్జరీ బస్సు 36మంది ప్రయాణికులతో శనివారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరింది. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మొద్దుల చెర్వు సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన ఆపి టైరు మార్చుతున్నారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు అతివేగంతో వస్తూ మరో బస్సును ఓవర్‌టెక్ చేయబోయ ఆగివున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కోదాడ డిపో ఆర్టీసి డ్రైవర్‌గా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గునగంటి సత్తయ్య (57), ఖమ్మం జిల్లా తళ్లంపాడు మండలం మల్లారం గ్రామానికి చెందిన కోటారి రాణి (37) అక్కడిక్కడే మృతిచెందారు. హుజూర్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ వేముల ఏడుకొండలు (48), కృష్ణా జిల్లా ఆవనిగడ్డకు చెందిన రిటైర్డ్ ఆర్టీసి డ్రైవర్ ఎం మురళీప్రసాద్ (60), బంతి కుటుంబరావు (60), హైదరాబాద్‌కు చెందిన మాతంగి వరప్రసాద్ (63) చికిత్స పొందుతూ కోదాడ, సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతిచెందారు. కాగా, ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి తీవ్ర గాయాలయ్యాయ. తొలుత వారిని సూర్యాపేట, కోదాడ ప్రాంతీయ ఆసుపత్రులకు తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ప్రకాశ్ జాదేవ్, డిఎస్పీ రమణారెడ్డి, కోదాడ గ్రామీణ సిఐ జి.రవి, ఎస్‌ఐ గడ్డం నగేష్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కోదాడ డిఎస్పీ రమణారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రాలు.. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన దృశ్యం. *నుజ్జునుజ్జయన లగ్జరీ బస్సు