రాష్ట్రీయం

వివాదాలకు అపెక్స్‌తోనే తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 166.32 టిఎంసికి చేరుకోవడంతో ఆ నీటిని వాడుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మాటల తీవ్రత పెంచాయి. వివాదాలకు తెరదించేందుకు నెలాఖరులోగా ఇద్దరు సిఎంలతో భేటీ నిర్వహించే యోచనలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశం జరిగింది. అధికారుల స్థాయిలో చర్చలు విఫలమవుతున్నాయని, సిఎంల సమావేశంలోనే నీటి తగాదాలకు పరిష్కరం లభిస్తుందని ఇప్పటికే కృష్ణా బోర్డు కేంద్రానికి లేఖ రాసింది.
శ్రీశైలంలో ప్రస్తుతం 212 టిఎంసికి 166 టిఎంసి, 885 అడుగులకు 875.6 అడుగుల నీటి మట్టం ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీకి నీటిని ఇచ్చే ప్రసక్తిలేదని, మంచినీటికి మాత్రమే వచ్చే ఏడాది జూలై వరకు ప్రణాళిక ఖరారు చేసుకోవాలని ఇప్పటికే కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. మరో వైపు పోతిరెడ్డిపాడుకు శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు వీలులేదని, నికర జలాలను నిర్దేశించిన ప్రాజెక్టులకు మాత్రమే వాడుకుందామని తెలంగాణ సిఎం కెసిఆర్ కరాఖండిగా చెప్పారు. దీంతో, జూరాల నుంచి 17.84 టిఎంసి కంటే ఎక్కువగా 26 టిఎంసి నీటిని తెలంగాణ వాడుకుందని ఆంధ్ర కొత్త వాదన లేపింది. మిగులు జలాలు ఉంటే తప్ప పోతిరెడ్డి పాడుకు మళ్లించేందుకు వీలులేదని, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టని, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కాల్వలకు మాత్రమే నీటిని వినియోగించుకునే హక్కు ఉందని కెసిఆర్ స్పష్టం చేశారు. కాగా జూరాల నుంచి 17.84 టిఎంసి మాత్రమే డ్రా చేయాల్సి ఉండగా, జూరాల ఎడమకాల్వ ద్వారా 6.73 టిఎంసి, కుడి కాల్వ ద్వారా 4.63 టిఎంసి, సమాంతర కాల్వ ద్వారా 3.17 టిఎంసి, భీమా ద్వారా 13.99 టిఎంసి, కోయిలసాగర్‌లో 2.3 టిఎంసి నీటిని తెలంగాణ వినియోగించిందని ఏపి సాగునీటి శాఖవర్గాలు తెలిపాయి. జూరాల ఆయకట్టు పరిధిలో వరి పండిస్తున్నారని, కాని ఆరుతడి పంటలు మాత్రమే పండించాల్సి ఉందని ఏపీ వర్గాలు తెలిపాయి. జూరాల, బీమా, కోయిలసాగర్ రిజర్వాయర్ల నుంచి నిర్దేశించిన నీటి కంటే ఎక్కువ నీటిని వాడుకుంటూ, పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని ఎక్కువగా వాడుకుంటోందని ప్రచారం చేస్తున్నారని ఆంధ్ర సాగునీటివర్గాలు తెలిపాయి. కాగా పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీపై విచారణ చేయాలన్న తెలంగాణ డిమాండ్‌పట్ల ఆశించిన స్ధాయిలో కృష్ణా బోర్డు స్పందించకపోవడంపై తెలంగాణ ఇప్పటికే నిరసన వ్యక్తం చేసింది.
కాగా శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 1.44 లక్షల క్యూసెక్కుల నీర వస్తుండగా, 24వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లో 146 టిఎంసికి నీటి నిల్వ చేరింది. ఇక్కడ జలాశయం మొత్తం కెపాసిటీ 312 టిఎంసి. ఈ నెల 14వ తేదీ వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో చేరుకున్న నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకుని నీటి విడుదలను ఖరారు చేస్తామని కృష్ణాబోర్డు ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన పూర్తి స్ధాయి మీటింగ్‌కు కసరత్తు జరుగుతోంది.