రాష్ట్రీయం

రైల్వేలో హోదా పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 1: రైల్వే స్టేషన్‌ల్లోని మేనేజర్ల హోదా పెరిగింది. ఇక నుంచి మేనేజర్‌కు బదులుగా స్టేషన్ డైరెక్టర్‌గా పిలుస్తారు. అయితే ఏ-వన్ రైల్వేస్టేషన్‌గా గుర్తింపుపొందిన స్టేషన్ మేనేజర్లను మాత్రమే స్టేషన్ డైరెక్టర్‌గా హోదా పెంచారు. ఈ అరుదైన అవకాశం విశాఖ రైల్వేస్టేషన్‌కు దక్కింది. ప్రయాణికులకు వౌలిక వసతులు కల్పించడంలో ముందుండడంతోపాటు స్వచ్ఛస్టేషన్‌గా అవార్డును పొందగలిగింది. అలాగే స్నేహపూర్వక పర్యాటక స్టేషన్‌గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. అన్నింటికంటే సరకు రవాణా, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం, ప్లాట్‌ఫారాల టికెట్ల విక్రయాలు, టికెట్ లేని ప్రయాణికుల నుంచి అపరాధ రుసుం వసూళ్ళు వంటి వాటితో ఏడాదికి ఆరు వేల కోట్లకు పైగానే వాల్తేరు డివిజన్ ఆదాయాన్ని సంపాదించగలుగుతుంది. అయితే ఏ-వన్ స్టేషన్‌గా గుర్తింపు పొందడానికి వార్షిక ఆదాయం రూ.60 కోట్లు ఉంటే సరిపోతుంది. ఇలా.. అన్నింటా ప్రథమ స్థానంలో నిలిచిన విశాఖ రైల్వేస్టేషన్‌కు కొత్తగా స్టేషన్ మేనేజర్ స్థాయిని పెంచారు. భారతీయ రైల్వే పరిధిలో 16 రైల్వేజోన్లు, దాదాపు 50 డివిజన్లు ఉండగా, వీటి పరిధిలోకి వచ్చే ఏ-వన్ రైల్వేస్టేషన్లు దాదాపు 200 వరకు ఉండవచ్చని వాల్తేరు డివిజన్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు సంబంధించి కేవలం విశాఖపట్నం, భువనేశ్వర్, పూరి రైల్వేస్టేషన్లు మాత్రమే ఏ-వన్ పరిధిలోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి రైల్వే అధికారిక ప్రకటన కూడా చేసింది. గ్రూప్-బికి చెందిన అధికారులే ఏ-వన్ రైల్వేస్టేషన్లకు స్టేషన్ డైరెక్టర్లుగా నియమించాలని కూడా రైల్వే నిర్ణయించింది. స్మార్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ రైల్వేస్టేషన్‌ను భద్రతాపరంగా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.