రాష్ట్రీయం

త్వరలో పుట్టపర్తికి వస్తా: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, అక్టోబర్ 1 : త్వరలో పుట్టపర్తికి వచ్చి భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. కెసిఆర్ ఆదివారం సత్యసాయి విమానాశ్రయం చేరుకోగా స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తాను త్వరలోనే మళ్లీ పుట్టపర్తికి వస్తానని, అప్పుడు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సైతం విశేష సేవలందించిన బాబా అజరామరుడు అన్నారు. బాబా విద్య, వైద్యం, తాగునీరు వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యారని కొనియాడారు.