రాష్ట్రీయం

మావోయిస్టు పార్టీ బలోపేతంపై.. సెంట్రల్ కమిటీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: మావోయిస్టు పార్టీ 13 ఏళ్ల తర్వాత ఆత్మావలోకనం చేసుకుంటోంది. రానున్న రోజుల్లో పార్టీ కేడర్‌ను పటిష్టం చేసే విషయమై పార్టీ సెంట్రల్ కమిటీ దృష్టిని సారించింది. మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన నార్తరన్ రీజనల్ బ్యూరో, ఈస్ట్రన్ రీజనల్ బ్యూరో, సెంట్రల్ రీజనల్ మ్యూరో, సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోలు బలహీనపడుతున్నాయని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఇటీవల జరిగిన సెంట్రల్ కమిటీ సమావేశాల్లో అభిప్రాయపడింది. ప్రతి నాలుగేళ్లకోసారి మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన సెంట్రల్ కమిటీ సమావేశాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం సెంట్రల్ రీజనల్ బ్యూరోలో దండకారణ్య ప్రత్యేక జోన్ కమిటీ క్లిష్టపరిస్ధితిని ఎదుర్కొంటుండగా, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు జోనల్ కమిటీ, ఓడిశా రాష్ట్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఆశించిన తీరులో పనిచేయడం లేదని, ఇటీవల కాలంలో దెబ్బమీద దెబ్బలను ఎదుర్కొంటున్నాయని, వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మావోయిస్టు సెంట్రల్ కమిటీ తీర్మానంలో పేర్కొన్నట్లు సమాచారం. నార్తన్ రీజనల్ బ్యూరో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బలహీనంగా ఉందని, సౌత్‌వెస్ట్ బ్యూరోలో కేరళ, కర్నాటక, తమిళనాడులో నాయకత్వ లేమి ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈస్ట్రన్ రీజనల్ బ్యూరోలో బీహార్, జార్కాండ్, ఉత్తర బీహార్, ఈశాన్య జార్కాండ్, పశ్చిమబెంగాల్, ఎగువ అస్సాంలో పార్టీ తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నట్లు పార్టీ అంచనా వేసింది.
దేశంలో విప్లవోద్యమం బలహీనపడుతోందని, యువకులు ఆశించిన స్ధాయిలో ఆకర్షితులు కావడం లేదని, క్రోనీ కేపటలిజం భ్రమల్లో యువత ఉందని పార్టీ అగ్రనేతలు అంచనా వేసినట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో, విశ్వవిద్యాలయాల్లో గతంలో మాదిరిగా వామపక్ష తీవ్రవాద శక్తులు చొచ్చుకుపోవడంలేదు. వర్శిటీలోని యువతలో సామాజిక దృక్పథం లోపించడం కూడా కారణంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. దండకారణ్యం ప్రాంతంలోనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఏ) తెగబడి దాడులకు పాల్పడుతున్నాయని, మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ వారి ఉనికిని చాటుకునేందుకుమినహా మావోయిస్టులు పార్టీ క్యాడర్‌లో స్తబ్ధత చోటుచేసుకున్నట్లు కేంద్ర పోలీసు వర్గాలు ఇప్పటికే నిర్ధారించాయి. 2005 నుంచి 2015 వరకు విస్తరించిన మావోయిస్టు పార్టీ గత రెండేళ్లలో ఆశించిన స్ధాయిలో పుంజుకోకపోవడానికి కారణాలపై కూడా పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం మావోయిస్టు పార్టీ ఉత్తరాది నేతలను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించిన ఆల్ ఇండియా రెవెల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడా ఈ మధ్య కాలంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మావోయిస్టుల హింసకాండ, పోలీసుల గాలింపు చర్యల్లో పౌరులు, భద్రతబలగాలు, మావోయిస్టులు కలిపి 2010లో 2916 మంది, 2011లో 2030 మంది, 2012లో 1901 మంది, 2013లో 2916 మంది, 2014లో 1397 మంది, 2015లో 1668 మంది, 2016లో 1840 మంది, 2017లో జూలై వరకు 1116 మంది బలయ్యారు.
ఒడిశాలో ఏడుగురు మావోయిస్టుల అరెస్టు
ఒడిశాలో సిపిఐ మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్ధ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ) జోనల్ కమిటీకి చెందిన ఏడుగురు సభ్యులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసినట్లు డిజిపి ఆర్‌పి శర్మ తెలిపారు. అరెస్టయిన వారిలో కరణ్ సాయి, అర్జున్ రాణా తదితరులు ఉన్నారు. వారి వద్ద నుంచి నాలుగు ఆయుధాలు, ఎకె 47, 50 రౌండ్ల మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కుకుడ్‌బహల్ అటవీ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని త్వరలో విచారిస్తామని పోలీసులు తెలిపారు.