రాష్ట్రీయం

కొలిక్కిరాని ఆస్తుల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగి మూడేళ్లు పూర్తయినా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల విభజన ప్రక్రియ కొలిక్కిరాలేదు. ఎక్కడి వివాదాలు అక్కడే ఉన్నాయి. పరిష్కారం చూపేందుకు నియమించిన షీలా బేడీ కమిటీకి కాలపరిమితి పూర్తయిన తర్వాత నాలుగుసార్లు కొనసాగింపు ఇచ్చినా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. ఒక్కోచోట ఒక్కో రకమైన వివాదం తలెత్తడంతో దానిని పరిష్కరించడం షీలా బేడీ కమిటీకి సవాల్‌గా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి నాలుగోసారి కమిటీని కేంద్రం పొడిగించింది. ఈ కమిటీ గడచిన మంగళ, బుధవారాల్లో సమావేశమైనా కొన్ని ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థల ఆస్తుల విభజనపై స్పష్టత రాలేదు. గిరిజన కార్పొరేషన్, మహిళా సహకార ఆర్థిక సంస్థ అధికారులతో సమావేశమైన కమిటీ సుధీర్ఘంగా చర్చించినా ఆస్తుల విభజనపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఆస్తుల విభజనలో సమాన వాటా కావాలని ఎపి కోరుతుంటే, ఎపి పునర్విభజన చట్టాన్ని అనుసరించి ఆస్తులను పంచాలని తెలంగాణ కోరుతోంది. ఉద్యోగుల విభజన పూర్తయినప్పటికీ ఆస్తుల విభజనలో మాత్రం ముందుకు కదలడం లేదు. ఇప్పటి వరకు 69 ప్రభుత్వ సంస్థల్లో ఆస్తుల విభజన పూర్తయ్యింది. కాగా ఆర్టీసి, ఎపిజెన్‌కో, సిపిడిసిఎల్, ఎపి ఫుడ్స్, గిరిజన కార్పొరేషన్ వంటి కొన్ని సంస్థల్లో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య తేడాలు వస్తున్నాయి. ఇక ఉద్యోగుల విషయానికొస్తే మొత్తం ఏడు వే ల మంది ఉద్యోగులు ఉంటే గత మూడేళ్ల నుంచి 3,800 మంది పదవీ విరమణ చేశారు. మిగిలిన వారు షీలా బేడీ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్‌టిసి ఆస్తుల ప్రక్రియపై ఇంకా వివాదం కొనసాగుతోంది.