రాష్ట్రీయం

సింగరేణిని పైవేటీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: సింగరేణిని ప్రైవేటీకరించే యోచన లేదని రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని అన్నారు. సింగరేణి ఓటర్లు చాలా తెలివైన వారని , సింగరేణి ఎన్నికల తర్వాత తమ నిర్ణయాలు ప్రకటిస్తామని చెప్పారు. కోదండరాం ద్రోహి అని నాయని పేర్కొన్నారు. ఒకనాడు తెరాస, ప్రజాసంఘాలు, ఎన్‌జిఓలు మద్దతు ఇస్తే ఆనాడు ఆయన టిజాక్ చైర్మన్ అయ్యాడని, కోదండరాంను టిజాక్ చైర్మన్‌ను చేసిందే కెసిఆర్ అని అన్నారు. కోదండరాంకు ఆర్ధిక సాయం చేసిందని కెసిఆర్ అని మరువరాదని, కోదండరాం మాత్రం తమకు ద్రోహం చేశాడని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇష్టం వచ్చిన వాళ్లకు ఓట్లు వేసుకోమని కోదండరాం అన్నారని, ఇపుడు టిజాక్ లేనేలేదని అన్నారు. ఐదో తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఎఐటియుసి తదితర సంఘాలకు ఓట్లు వేయవద్దని, అవకాశవాద రాజకీయాలకు తావివ్వవద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్టు నాయకులు కలిసి తెరాసను ఓడించాలని చూస్తున్నారని అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. సింగరేణిని కాపాడటానికి హెచ్‌ఎంఎస్ రాష్ట్ర కమిటీ 27న సమావేశమై టిబిజికెను గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానించిందని అన్నారు. గతంలో అన్ని సంఘాలు పోటీ చేస్తే నాలుగేళ్ల తర్వాత మెజార్టీ స్థానాల్లో టిబిజికెఎస్ గెలిచిందని అన్నారు. ఇపుడు హెచ్‌ఎంఎస్ నిట్టనిలువుగా చీలిపోయిందని ఆయన పేర్కొన్నారు.