రాష్ట్రీయం

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 2: సమైక్యవాదుల పాలనలో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న మూడు ప్రాజెక్టులను సోమవారం ప్రారంభించిన అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన సభలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 34 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదిలేసిందన్నారు. నాడు ధనయజ్ఞంగా ఉన్న పథకాలను మార్చి టిఆర్‌ఎస్ పాలనలో జలయజ్ఞంగా తయారు చేశామని స్పష్టం చేశారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల సహకారంతో త్వరలోనే తమ లక్ష్యాన్ని అందుకుంటామన్నారు. కేవలం విమర్శించడమే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పినా మార్పు రాలేదని, వచ్చే ఎన్నికల్లో కూడా గుణపాఠం తప్పదన్నారు. అభివృద్ధి జరుగుతున్నా జీర్ణించుకోలేక ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొమ్మిది నెలల కాలంలోనే భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించామని, 19నెలల్లో పూర్తి చేయాల్సిన పాలేరు పాత కాల్వ ఆధునీకరణ పనులను కేవలం నాలుగు నెలల్లో పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత తమదేనన్నారు. 11ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న పాలెంవాగు ప్రాజెక్టు, కినె్నరసాని ఎడమ కాల్వ పనులు పూర్తిచేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. గోదావరి నీటితో తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నామని, అది పూర్తయితే రాష్ట్రంలో మరో పార్టీకి మనుగడ కూడా ఉండదని పేర్కొన్నారు. అది జరుగుతుందని తెలుసుకొని తట్టుకోలేక విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తిచేసి లక్షలాది ఎకరాలు సాగులోకి తీసుకువస్తామన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా తాము ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మోడల్‌గా నిలుస్తున్నదని, దేశంలోనే తక్కువ కాలంలో పూర్తయిన ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు నీరిచ్చే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వల్పకాలంలోనే పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్‌ను, అధికారులను మంత్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, తదితరులు పాల్గొన్నారు.