రాష్ట్రీయం

పేదలందరికీ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 2: రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ వేదికగా సోమవారం రెండో సంవత్సర చంద్రన్న బీమా కార్యక్రమ ప్రారంభం, ఎన్టీఆర్ లక్ష గృహ ప్రవేశాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సిఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కొత్తగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాల్లోకి ముఖ్యమంత్రి లాంఛనంగా గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 16 వేల కోట్ల రూపాయలతో 12 లక్షల ఇళ్లను, పట్టణ ప్రాంతాల్లో 5.4 లక్షల ఇళ్లను 33 వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆ ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. లక్ష ఇళ్లకు సోమవారం గృహ ప్రవేశాలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఆవాస దినోత్సవం రోజున ఇన్ని గృహ ప్రవేశాలు ఒకే రోజు జరగడం చరిత్రగా అభివర్ణించారు. పేదవాడి సొంత ఇంటి కలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాకారం చేస్తామన్నారు. 2019 నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణాన్ని ఒక బోగస్ వ్యవహారంగా మార్చేసారని ఆరోపించారు. పేదవాళ్ల పేరుతో మంజూరైన లక్షల ఇళ్ల జాడ లేదని, వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అవినీతికి తావు లేకుండా ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ఒక్కపైసా అవినీతి జరిగినా, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమస్యలున్నా, అవినితీ వ్యవహారాల గురించి కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. మూడు విడతలుగా రాష్ట్రంలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి, క్రిస్మస్, తాను అధికారం చేపట్టిన రోజు జూన్ 8న గృహ ప్రవేశాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోయినా, సంకల్పం ఉందని స్పష్టం చేశారు. పేదలందరికీ కూడా 10 వేల రూపాయలు ఆదాయం లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పుట్టుక నుంచి చనిపోయే వరకూ ప్రజలకు కావాల్సిన వాటి గురించి ఆలోచించే ప్రభుత్వం తమదన్నారు. విద్య, వైద్యంలో ప్రజల ఖర్చులు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రెండో సంవత్సరం చంద్రన్న బీమా ప్రారంభం
రాష్ట్రంలో 8 నెలల పాటు అమల్లో ఉండే రెండో సంవత్సర పిఎంజెజెబివై-చంద్రన్న బీమాను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2.4 కోట్ల మందికి లబ్ధి చేకూరే చంద్రన్న బీమాను అమలు చేస్తున్నామన్నారు. దీని వల్ల పేదల జీవితాలకు భద్రత కల్పిస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన 1100 రూపాయల ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాణాలు విలువైననని, జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై ప్రతినెల సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధితో పాటు అవినీతి లేని పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసి ఎండి సునీత శర్మకు 213 కోట్ల రూపాయల బీమా ప్రీమియం చెక్కును సిఎం అందచేశారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధించి సిఎంకు సునీత శర్మ 160 కోట్ల రూపాయల చెక్కును అందచేశారు. ఈ సమావేశంలో మంత్రులు కాలవ శ్రీనివాసులు, లోకేష్, పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, క్రీడాకారిణి పివి సింధు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..లక్ష గృహప్రవేశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తదితరులు