రాష్ట్రీయం

ఏంచేయాలో తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: ‘కేవలం మాటలతో కాలం వెళ్ళబుచ్చడం కాదు, ప్రజా జీవితంలో 40 సంవత్సరాలుగా ఉన్న అనుభవానికి తోడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంతో ప్రజలకు ఏమి చేయాలన్న దానిపై స్పష్టత ఉంది. తెలంగాణ కోసం ఏమి చేస్తే బాగుంటుందో అధ్యయనం చేసాం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘ప్రకృతి కల్పించిన అపారమైన సంపదతో దేశంలో, రాష్టల్రో ఉత్పత్తి చేయలేనిదంటూ ఏమి లేదు. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణను సుసంపన్నం చేస్తూ ముందుకు సాగిపోతున్నాం’ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కురుమల సమావేశంలో పాల్గొనడానికి సోమవారం ఇక్కడికి వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ
కార్యక్రమాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. వెనుకబడిన తరగతులకు, గొల్ల, కరుమల కోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం పట్ల వారు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గొర్రెల పంపిణీ పథకం ద్వారా 84 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తామని ప్రకటిస్తే అన్ని గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకోస్తారని తమను ఎగతాళి చేశారన్నారు. అయినప్పటికీ మొదటి దశలోనే 23.80 లక్షల గొర్రెలను పంపిణీ చేసి చూపించామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, మంచి చేయాలన్న ధృడ సంకల్పం ఉంటే అసాధ్యమైనదానిని కూడా సుసాధ్యం చేసి చూపించవచ్చనడానికి తమ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్టస్రాధన కోసం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించిన రాష్ట్రానికి ఏం చేస్తే మంచిదో బాగా ఆలోచించామన్నారు. తెలంగాణ గురించి అర్థం చేసుకోవడానికి చాలా అధ్యయనం చేశామన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా అధ్యయనం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు తెలంగాణకు మేలు చేసినట్టు అయితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాని అలా జరుగలేదని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో వ్యవసాయాన్ని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు, పట్టించుకోలేదు దాని వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. ఆ పరిస్థితిని పోగొట్టేందుకు రైతులను సంఘటిత పరిచే చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా రైతు సమన్వయ సమితీలను ఏర్పాటు చేసామని, ఏడాదికి ఎకరానికి రూ.8 వేల పెట్టుబడిని వచ్చే ఏడాది నుంచి ఉచితంగా ఇవ్వబోతున్నామన్నారు. రైతులు, గొర్రెల పెంపకందారులు, పాల విక్రయదారులు ఇలా ఒక్కోక్కరూ బాగుపడితే రాష్ట్రం అనతికాలంలోనే ఆర్థికంగా బలపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో తామే అఖిల భారత గొర్రెల పెంపకం దారుల సభలు నిర్వహిస్తామన్నారు. గొల్ల-కురుమల సంఘం వసతి గృహానికి పది ఎకరాల స్థలం, పది కోట్ల రూపాయల సహాయం చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచే అవకాశం లేని వెనుకబడిన తరగతుల వారికి శాసన మండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని యోచిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కర్నాటక మంత్రులు రేవన్న, బందప్ప, ఎమ్మెల్యే ప్రకాష్ వార్తుర్, మహారాష్టక్రు చెందిన మంత్రులు మహాదేవ్ జంకార్, రాం షిండే, ఢిల్లీ వాటర్ బోర్డు వైస్ చైర్మన్ దినేశ్ మొహారియా, తమిళనాడు కురుమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణమూర్తితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం తదితరులు ఉన్నారు.

చిత్రం.. వివిధ రాష్ట్రాల యాదవ మంత్రులు, ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్