రాష్ట్రీయం

తప్పంతా వీసీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: పక్షపాత వైఖరిని ప్రదర్శించడం ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పాలకులు రీసెర్చి విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకు పురిగొల్పేలా వ్యవహరించారని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చారు. ఈ సందర్భంగా రోహిత్ స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మాట్లాడిన రాహుల్ విద్యార్ధులు ధైర్యంగా ఉండాలని, రోహిత్ ఆత్మహత్య వ్యవహారం తెలిసి తీవ్రంగా కలత చెంది వచ్చానని తెలిపారు. తాను రాజకీయ నాయకుడిగా రాలేదని, ఒక యువకుడిగా వచ్చానని అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. యూనివర్శిటీ క్యాంపస్‌ల్లో పక్షపాత ధోరణి పెరిగిపోతోందని, దాని వల్లనే విద్యార్ధుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన తర్వాత పరామర్శించే నైతిక బాధ్యత వైస్ ఛాన్సలర్‌కు ఉందని ఆ బాధ్యతను విసి విస్మరించారని అన్నారు. క్యాంపస్‌లో ఒక విద్యార్ధి అనారోగ్యంతోనో, సహజంగా మరణించినా దానిని సీరియస్‌గా తీసుకుంటామని, విద్యార్ధి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడతామని కానీ అలాంటిది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కూడా పట్టించుకోకపోవడం విసి తప్పేనని అన్నారు. విద్యార్ధి ఆత్మహత్యకు పురిగొల్పిన అంశాల్లో కేంద్ర మంత్రి సైతం సక్రమంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. మంత్రి వ్యవహారంపై జాతీయ స్థాయిలోనే తీవ్ర దుమారం చెలరేగిందని అన్నారు. విశ్వవిద్యాలయాలున్నది జ్ఞానార్జనకేనని, విద్యార్ధుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు. వీసీ, కేంద్ర మంత్రి ఇరువురూ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపించారు. పరిస్థితులు విషమించి మరో మార్గం లేకనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్ విశే్లషించారు. ఆ విధంగా పరిస్థితులను విసి తయారుచేశారని అన్నారు. విద్యార్ధుల పట్ల కనీస గౌరవం విసికి లేదని ఈ ఘటనతో తేలిపోయిందని చెప్పారు. ప్రస్తుతం రోహిత్ కుటుంబం ముందున్న అంశాలు రెండే రెండని, ఒకటి చట్ట ప్రకారం దోషులపై చర్యలు తీసుకోవడం, మరొకటి రోహిత్ కుటుంబానికి తగిన విధంగా పరిహారం అందించడమేనని అన్నారు. ఈ ఘటన వెనుక బాధ్యులు ఎవరైనప్పటికీ పరిహారం చెల్లించాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రోహిత్ తల్లి రాధికతో కూడా మాట్లాడారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలు శ్రీ్ధర్‌బాబు, భట్టి విక్రమార్క, వి హనుమంత రావు తదితరులున్నారు.
నేడు సీతారాం ఏచూరి రాక
సిపిఎం అఖిల భారత ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి బుధవారం నాడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి రానున్నారని ఆ పార్టీ కమిటీ సభ్యుడు జె. వెంకటేష్ చెప్పారు.
చిత్రం...
హెచ్‌సియులో ఆందోళన చేపట్టిన విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న రాహుల్